AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar-Pan Link: ఆధార్‌, పాన్‌ ఇంకా లింక్‌ చేయలేదా.. అయితే పెను భారం తప్పదు.. మీ దాచుకున్న డబ్బుల్లోనూ కోత..

పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే, అటువంటి పాన్ కార్డు 1 జూలై 2023 నుంచి పనిచేయడం లేదు. దీంతో ఫిక్స్ డ్ డిపాజిట్ కలిగిన వినియోగదారులు ఫారమ్ 15 జి/హెచ్‌ని సమర్పించడానికి అనుమతి ఉండదు. అంతేకాక పనిచేయని పాన్‌లు కలిగిన ఖాతాలపై అధిక టీడీఎస్‌ కట్‌ అవుతుంది.

Aadhaar-Pan Link: ఆధార్‌, పాన్‌ ఇంకా లింక్‌ చేయలేదా.. అయితే పెను భారం తప్పదు.. మీ దాచుకున్న డబ్బుల్లోనూ కోత..
Aadhaar - Pan Card
Madhu
|

Updated on: Jul 10, 2023 | 7:30 AM

Share

ఆధార్‌తో పాన్‌ అనుసంధానానికి సమయం ముగిసింది. పలు దఫాలుగా గడువు పొడిగిస్తూ వచ్చిన ప్రభుత్వం అపరాధం రుసుంతో 2023 జూన్‌ 30 వరకూ ఇచ్చిన సమయం అయిపోయింది. ఒకవేళ ఇప్పటికీ ఆధార్‌ పాన్‌ కార్డులను లింక్‌ చేయకపోతే ఆర్థిక లావాదేవీలు, ఆదాయ పన్నులు చెల్లింపుదారులకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఆధార్‌, పాన్‌ కార్డులను లింక్‌ చేయని వారి పాన్‌ కార్డు నిలిచిపోయింది. దానిపై ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయలేరు. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లో పెట్టుబడులు పెట్టిన వారుమరింతగా ఇబ్బంది పడతారు. పాన్‌ పనిచేయదు కాబట్టి మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి వ్యతిరేకంగా ఫారమ్ 15 జీ/హెచ్‌ సమర్పించడానికి మీరు అనుమతి ఉండదు. అలాగే నగదుపై టీడీఎస్‌ 10శాతానికి బదులుగా 20శాతం డిడక్ట్‌ అవుతుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చెబుతున్న దాని ప్రకారం..

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వెబ్‌ సైట్లో పొందుపరిచింది. ‘పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే, అటువంటి పాన్ కార్డు 1 జూలై 2023 నుంచి పనిచేయడం లేదు. దీంతో ఫిక్స్ డ్ డిపాజిట్ కలిగిన వినియోగదారులు ఫారమ్ 15 జి/హెచ్‌ని సమర్పించడానికి అనుమతి ఉండదు. అంతేకాక పనిచేయని పాన్‌లకు అధిక టీడీఎస్‌ కట్‌ అవుతుంది’ అని పేర్కొంది. అంటే మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై ఒక ఆర్థిక సంవత్సరంలో సాధారణ పౌరులకు అయితే రూ. 40,000, అదే సినీయర్‌ సిటిజెన్స్‌కు అయితే రూ. 50,000 కంటే ఎక్కువ వడ్డీని సంపాదిస్తే, మీరు ఆ ఎఫ్‌డీ పెట్టుబడులపై టీడీఎస్‌ వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం, 1961 నిబంధనల ప్రకారం, జూలై 1, 2017 నాటికి పాన్, ఆధార్ నంబర్‌ లింక్‌ చేయడాన్ని తప్పనిసరి చేశారు.

ఇవి కూడా చదవండి

ఆధార్‌, పాన్‌ లింక్‌ కాకపోతే నష్టాలు ఏంటి?

  • ఆధార్‌ పాన్‌కార్డులు లింక్‌కాకపోతే టీడీఎస్‌ 20శాతం రికవరీ చేస్తారు. ఇది ఆధార్‌ పాన్‌ లింక్‌ అయితే 10శాతం ఉంటుంది.
  • ఆదాయపు పన్ను శాఖ నుండి టీడీఎస్‌ క్రెడిట్‌ అవ్వదు.
  • సీబీడీ సర్క్యులర్ సంఖ్య:03/11 ప్రకారం టీడీఎస్‌ ప్రమాణపత్రం జారీకాదు.
  • ఫారమ్ 15జీ/హెచ్‌, ఇతర మినహాయింపు సర్టిఫికెట్లు చెల్లవు టీడీఎస్‌ జరిమానా వర్తిస్తుంది.
  • అయితే, రూ. 1,000 రుసుము చెల్లించిన తర్వాత నిర్ణీత అథారిటీకి ఆధార్‌ను తెలియజేసినప్పుడు, పాన్ 30 రోజుల్లో మళ్లీ యాక్టివ్‌ అవుతుంది.

ఆధార్‌, పాన్‌ లింక్‌ చేయకపోతే..

  • ఒకవేళ మీ పాన్‌ కార్డు పనిచేయకపోతే ఎటువంటి రిఫండ్‌ లను క్లయిమ్‌చేసుకోలేరు.
  • పాన్‌ పనిచేయని కాలానికి రావాల్సిన రిఫండ్‌లకు ఎటువంటి వడ్డీలను చెల్లించరు.
  • టీడీఎస్‌/టీసీఎస్‌ డిడక‌్షన్‌ అధికంగా ఉంటుంది.
  • అలాగే మీరు రూ. 50,000 కన్నా ఎక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయలేరు. కొత్త డెబిట్‌ కార్డు, క్రెడిట్‌కార్డుకు జారీ కాదు.
  • మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టలేరు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడిని విత్‌డ్రా చేయలేరు.
  • రూ. 50,000 కన్నా ఎక్కువ ఫారిన్‌ కరెన్సీని పర్చేస్‌ చేయలేరు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..