AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Revenue: పరుగులు తీస్తున్న జీఎస్టీ వసూళ్లు.. ఐదేళ్లలో రెండోసారి రికార్డ్.. జూన్ నెలలో ఎంత పెరిగాయంటే..

జీఎస్టీ అమలుకు ముందు దేశంలో నమోదైన పన్ను చెల్లింపుదారుల సంఖ్యం 59.75 లక్షలుగా ఉండేది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఆ సంఖ్య రెండింతలు పెరిగి 1.36 కోట్లకు చేరుకుంది.

GST Revenue: పరుగులు తీస్తున్న జీఎస్టీ వసూళ్లు.. ఐదేళ్లలో రెండోసారి రికార్డ్.. జూన్ నెలలో ఎంత పెరిగాయంటే..
Venkata Chari
|

Updated on: Jul 01, 2022 | 3:38 PM

Share

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయం జూన్ నెలలో రూ.1.44 లక్షల కోట్లకు పెరిగిందని, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 56 శాతం పెరిగిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. రూ. 1.4 లక్షల కోట్లు ఇప్పుడు జీఎస్టీ వసూళ్లకు తక్కువ పరిమితిగా మారాయని సీతారామన్ అన్నారు. అంతకుముందు మే 2022లో జీఎస్టీ ఆదాయం రూ.1.41 లక్షల కోట్లుగా ఉంది. గత 5 సంవత్సరాలలో జీఎస్టీ పరోక్ష పన్నుల సంక్లిష్టతలను చాలా వరకు తగ్గించింది. 40 రకాల పన్నులు, సెస్‌లకు బదులు ఒకే పన్నును ప్రవేశపెట్టడం వల్ల వ్యాపారులు, ట్యాక్స్ ప్రాక్టీషనర్ల పని సులువైంది. ఇది పన్ను ఎగవేతను కూడా భారీగా తగ్గించింది. దీంతో పన్ను చెల్లింపుదారుల సంఖ్య రెండింతలు పెరిగింది. వార్షిక పరోక్ష పన్నుల సేకరణ కంటే 1.5 రెట్లు ఎక్కువగా జమ అయ్యాయి. అయినప్పటికీ మూడవ వంతు కంటే ఎక్కువ మంది వ్యాపారులు GSTని ఇప్పటికీ సంక్లిష్టంగానే భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జీఎస్టీ నియమాలను అనుసరించడానికి వ్యాపారులకు గతంలో కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలలో జీఎస్టీ నియమాలు, నిబంధనలలో 1,100 కంటే ఎక్కువ మార్పులు జరిగాయి. ఇది పన్ను చెల్లింపుదారులు, పన్ను ప్రాక్టీషనర్లను ఇరుకున పెట్టింది. అంతే కాకుండా ఐదేళ్ల తర్వాత కూడా పెట్రోల్, డీజిల్‌లు జీఎస్టీ పరిధిలోకి రాకపోవడంతో సామాన్యులు కూడా నిరాశకు గురవుతున్నారు. కొత్త పరోక్ష పన్నుల విధానంతో మొదట్లో ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు ఆశించినంత ఊరట లభించలేదు.

జీఎస్టీ అమలు వల్ల ఆదాయపు పన్ను రిటర్నులు కూడా పెరిగాయి..

ఇవి కూడా చదవండి

జీఎస్టీ అమలుకు ముందు దేశంలో నమోదైన పన్ను చెల్లింపుదారుల సంఖ్యం 59.75 లక్షలుగా ఉండేది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఆ సంఖ్య రెండింతలు పెరిగి 1.36 కోట్లకు చేరుకుంది. దీంతో ఈ ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఒకటిన్నర రెట్లకు పైగా పెరిగాయి. దీంతో ఆదాయపు పన్ను రిటర్నులు కూడా పెరిగాయి.