AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై కేంద్రం GST లెక్కలు.. పూర్తి వివరాలు

జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియం జీఎస్టీ వసూళ్లపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర లెక్కలు చెప్పింది. ఈఏడాదిలో 8వేల కోట్లకు పైగా జీఎస్టీ వసూలైనట్లు కేంద్రమంత్రి తెలిపారు.

జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై కేంద్రం GST లెక్కలు.. పూర్తి వివరాలు
Insurance
Ravi Kiran
|

Updated on: Aug 06, 2024 | 7:14 AM

Share

జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తొలగించాలన్న డిమాండ్‌తో కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర లెక్కలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపైనే 8వేల 263 కోట్ల జీఎస్‌టీ రూపంలో వసూలైనట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. జీఎస్టీ వసూళ్లపై లోక్‌సభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ తొలగించాలని కొద్దిరోజుల కిందట కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఇదే తరహాలో విజ్ఞప్తి చేశారు. దీంతో వాటిని తొలగించాలని పలు విజ్ఞప్తులు వచ్చినట్లు వెల్లడించారు పంకజ్ చౌధరి. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై ప్రస్తుతం 18 శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఇదే క్రమంలో పేదలు, దివ్యాంగుల కోసం ఉద్దేశించిన యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, జన ఆరోగ్య బీమా పాలసీ, నిర్మయ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ వంటి పలు రకాల బీమా పాలసీ ప్రీమియంలను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు చెప్పారు చౌధరి.

2023-24 ఆర్థిక సంవత్సరంలో 8వేల 262.94 కోట్లు, 2022-23 ఆర్ధిక ఏడాదిలో 7వేల 638 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 5వేల 354 కోట్ల హెల్త్ ఇన్సూరెన్స్‌పై GST రూపంలో వచ్చినట్లు చెప్పారు మంత్రి. జీఎస్టీ తొలగింపుపై కేంద్రం, రాష్ట్రాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కరోనా తర్వాతి ఆరోగ్య బీమాకు డిమాండ్ విపరీతంగా పెరిగడంతో ప్రజలు ఎక్కువగా పాలసీలు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే దానిపై జీఎస్టీని తొలగించాలనే డిమాండ్లు కూడా పెరిగాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
మీ ఇంట్లో ఫ్రిజ్ ఇలా ఉందా.. అయితే వెంటనే మార్చుకోండి.. లేదంటే..
మీ ఇంట్లో ఫ్రిజ్ ఇలా ఉందా.. అయితే వెంటనే మార్చుకోండి.. లేదంటే..