Gold Price Today: మహిళలకు తీపి కబురు.. దిగి వచ్చిన బంగారం ధరలు.. పెరిగిన వెండి.. ఎంతో తెలుసా?

మహిళలు ఎక్కువగా ఇష్టపడేది ఏదైనా ఉందా అంటే అది బంగారమే అని చెప్పక తప్పదు. బంగారానికి వారు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు.. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే వారు ఒంటినిండా బంగారు నగలతో మెరిసిపోవాలని భావిస్తుంటారు. ఏది కొన్నా బంగారం లేనిది వారికి వెలితిగా ఉంటుంది. అందుకు మహిళలకు బంగారం తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు. పెళ్లిళ్లు..

Gold Price Today: మహిళలకు తీపి కబురు.. దిగి వచ్చిన బంగారం ధరలు.. పెరిగిన వెండి.. ఎంతో తెలుసా?
Gold Price
Follow us
Subhash Goud

|

Updated on: Aug 06, 2024 | 6:27 AM

మహిళలు ఎక్కువగా ఇష్టపడేది ఏదైనా ఉందా అంటే అది బంగారమే అని చెప్పక తప్పదు. బంగారానికి వారు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు.. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే వారు ఒంటినిండా బంగారు నగలతో మెరిసిపోవాలని భావిస్తుంటారు. ఏది కొన్నా బంగారం లేనిది వారికి వెలితిగా ఉంటుంది. అందుకు మహిళలకు బంగారం తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరిగినా బంగారం షాపులన్ని వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. అయితే అందనంత ఎత్తుకు దూసుకుపోయిన బంగారం ధరలు.. ఇటీవల కేంద్ర బడ్జెట్‌ సందర్భంగా మంత్రి నిర్మలాసీతారామన్‌ చేసిన ప్రకటనతో ధరలు దిగి వచ్చాయి. బంగారంపై కస్టమ్స్‌ సుంకం తగ్గించడంతో భారీగా దిగి వచ్చాయి. అయితే తాజాగా ఆగస్టు 6వ తేదీన ఉదయం 6 గంటల సమయానికి దేశంలో బంగారం ధరలు స్వల్పంగా దిగి వచ్చాయి. అంటే తులం బంగారంపై కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గింది.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,690 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.70,570 వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

  1. ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,690 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.70,570 ఉంది.
  2. ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,840 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.70,720 ఉంది.
  3. హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,690 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.70,570 ఉంది.
  4. చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,4710 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.70,590 ఉంది.
  5. బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,570 వద్ద ఉంది.
  6. విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,570 వద్ద ఉంది.
  7. కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,570 వద్ద ఉంది.
  8. కోల్‌కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,570 వద్ద ఉంది.

ఇదిలా ఉండగా, బంగారం ధరలు తగ్గుతూ ఉంటే వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. దేశంలో కిలో వెండి ధరపై వంద రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.85,800 ఉంది. అయితే హైదరాబాద్‌, కేరళ, చెన్నై నగరాల్లో మాత్రం వెండి ధర భారీగానే ఉంది. ఇక్కడ కిలో వెండి రూ.91 వేల వరకు ఉంది. మిగితా ప్రాంతాల్లో రూ.85,800 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి