Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. ఆ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు

తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌ను ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఈ సేల్ 12 గంటల ముందుగానే అందుబాటులోకి వస్తుంది.  గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2024 మంగళవారం నుంచి (ఆగస్టు 6 మధ్యాహ్నం) ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులు అర్ధరాత్రి నుంచే ప్రారంభమయ్యే సేల్‌కు ముందస్తు యాక్సెస్‌ను పొందవచ్చు.

Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. ఆ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు
Amazon Great Freedom Festival
Follow us
Srinu

|

Updated on: Aug 05, 2024 | 10:20 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్ నడుస్తుంది. ప్రజలు షాపులకు వెళ్లి ఉత్పత్తులు కొనేదానిక కన్నా తక్కువ ధరకే మంచి ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చని భావించడంతో అమ్మకాలు జోరందుకున్నాయి. భారత్‌లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లు ప్రజల ఆదరణను పొందాయి. అలాగే ఆయా సైట్లు ఎప్పటికప్పుడు కొత్త తరహా ఆఫర్లతో మన ముందుకు వస్తూ ఉంటాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌ను ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఈ సేల్ 12 గంటల ముందుగానే అందుబాటులోకి వస్తుంది.  గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2024 మంగళవారం నుంచి (ఆగస్టు 6 మధ్యాహ్నం) ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులు అర్ధరాత్రి నుంచే ప్రారంభమయ్యే సేల్‌కు ముందస్తు యాక్సెస్‌ను పొందవచ్చు. ఈ నేపథ్యంలో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్టు 6 నుంచి ఆగస్టు 11 వరకు కొనసాగుతుంది. అలాగే కస్టమర్లకు 5 రోజుల షాపింగ్ అవకాశాలను అందిస్తుంది. ప్రమోషనల్ కార్యకలాపాల్లో భాగంగా అమెజాన్ ఇండియా ఉత్తేజకరమైన డీల్స్, కొత్త ప్రోడక్ట్ లాంచ్‌లను చేయడానికి పోకోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లు సేల్ సమయంలో అనేక ఆఫర్లను పొందవచ్చని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు. అధికారిక నాన్-మెంబర్ విక్రయాలు ప్రారంభమయ్యే 12 గంటల ముందు ఉత్పత్తులు, డీల్‌లపై తగ్గింపు ఆఫర్లను ప్రైమ్ మెంబర్లు పొందవచ్చు. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి చేసే కొనుగోళ్లకు అదనంగా 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తున్నారు. అలాగే ప్రైమ్ సభ్యులు వారి మొదటి ఆర్డర్‌పై ఉచిత డెలివరీని అందించడంతో పాటు షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి పే-ఆన్-డెలివరీ వంటి సేవలను అమెజాన్ అందిస్తుంది. 

రాబోయే గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో లాజిటెక్, బోఆట్, సోనీ, ఎల్‌జీ, నాయిస్ వంటి ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్‌ల నుంచి గణనీయమైన తగ్గింపులు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సామ్‌సంగ్, ఎల్‌జీ, ఎంఐ, సోనీ వంటి బ్రాండ్‌ల టీవీలు కేవలం రూ.6,999 నుంచి కొనుగోలు చేయవచ్చు. అలాగే హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు కేవలం రూ.99 నుంచి అందుబాటులో ఉంటాయి. అలెక్సా, ఫైర్ టీవీ పరికరాలు రూ. 2,599 నుంచే అందుబాటులో ఉంటాయి. గ్రేట్ ఫ్రీడమ్ సేల్ వివిధ వర్గాల ప్రజలతో పాటు టెక్ ఔత్సాహికులు తగ్గింపులు ధరల్లోనే ఉత్పత్తులను పొందవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

60కు చేరువైనా పెళ్లి ఊసెత్తని సల్మాన్.. అసలు విషయం ఇదే!
60కు చేరువైనా పెళ్లి ఊసెత్తని సల్మాన్.. అసలు విషయం ఇదే!
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు