AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Technology: మనిషి చెమటతో ఫోన్‌ ఛార్జింగ్‌.. డివైజ్‌ను రూపొందించిన శాస్త్రవేత్తలు

ఇందులో భాగంగానే ఓ డివైజ్‌ను రూపొందించారు. మీ చేతి వేళ్లతో ఫోన్‌ను ఛార్జ్‌ చేయగల డివైజ్‌ను తయారు చేశారు. కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు చెమట నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పరకరాన్ని రూపొందించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు బృందం ఈ గ్యాడ్జెట్‌ను రూపొందించింది. నిద్ర పోతున్న సమయంలో ఈ గ్యాడ్జెట్‌ను చేతికి ధరిస్తే..

Technology: మనిషి చెమటతో ఫోన్‌ ఛార్జింగ్‌.. డివైజ్‌ను రూపొందించిన శాస్త్రవేత్తలు
Charger
Narender Vaitla
|

Updated on: Aug 05, 2024 | 5:20 PM

Share

స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించని వారు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ చిన్న పనికి స్మార్ట్‌ ఫోన్‌ తప్పనిసరికావడంతో ఫోన్‌ల వినియోగం భారీగా పెరిగింది. ఇదిలా ఉంటే స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించే వారిలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఛార్జింగ్ ఒకటి. ఎక్కడికి వెళ్లినా వెంట ఛార్జర్‌ పెట్టుకొని వెళ్లే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మన శరీరమే ఒక ఛార్జర్‌లా పనిచేస్తే ఎలా ఉంటుంది.? శరీరం ఛార్జర్‌లా ఎలా పనిచేస్తుందనేగా మీ సందేహం. అయితే దీనిని నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు పరిశోధకులు.

ఇందులో భాగంగానే ఓ డివైజ్‌ను రూపొందించారు. మీ చేతి వేళ్లతో ఫోన్‌ను ఛార్జ్‌ చేయగల డివైజ్‌ను తయారు చేశారు. కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు చెమట నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పరకరాన్ని రూపొందించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు బృందం ఈ గ్యాడ్జెట్‌ను రూపొందించింది. నిద్ర పోతున్న సమయంలో ఈ గ్యాడ్జెట్‌ను చేతికి ధరిస్తే.. అది చెమట నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విద్యుత్ సహాయంతో స్మార్ట్ ఫోన్‌లతో పాటు, స్మార్ట్‌ వాచ్‌లను సులభంగా చార్జ్‌ చేసుకోవచ్చు.

ఇలా 10 గంటల పాటు వేలిపై డివైజ్‌ను ధరిస్తే 24 గంటల పాటు ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చని పరిశోధకుల బృందం చెబుతోంది. అయితే చెమట ద్వారా ఈ డివైజ్‌ ఛార్జింగ్ అవ్వడం అంత సులభమైన విషయం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ డివైజ్‌ను ఏకంగా మూవు వారాల పాటు చేతి వేళ్లకు ధరిస్తేనే విద్యుత్‌ను ఛార్జ్‌ చేసే అవకాశం లభిస్తుంది. అయితే భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇంతకీ ఈ డివైజ్‌ ఎలా పనిచేస్తుందంటే.. చిన్న చిప్‌ సైజ్‌లో ఉండే ఈ పరికరాన్ని ప్లాస్టర్‌లాగా వేళ్లకు చుట్టుకోవాల్సిన ఉంటుంది. ఇందులోని కార్బణ్ ఫోమ్‌ ఎలక్ట్రోడ్‌ల పాడింగ్ చెమటను గ్రహిస్తుంది. ఇది చెమటను విద్యుత్‌గా మారుస్తుంది. వేళ్ల నుంచి వచ్చే చెమటను తడిసినప్పుడు లేదా స్ట్రిప్‌పై ఒత్తిడి ఏర్పడుతుంది. అది విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డివైజ్‌ను పూర్తి స్థాయిలో రూపొందించిన తర్వాత మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us