AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Security Alert: యాపిల్ యూజర్లకు రెడ్ అలర్ట్.. ప్రమాదంలో డేటా సెక్యూరిటీ.. వెంటనే ఇలా చేయండి..

మీరు యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటివి వినియోగిస్తున్నారా? అయితే మీకో బిగ్ అలర్ట్. మీ గ్యాడ్జెట్లు ప్రమాదంలో ఉన్నాయని భారత ప్రభుత్వ నోడల్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) 2024, ఆగస్టు 2న అధిక తీవ్రత రేటింగ్‌తో హెచ్చరికను జారీ చేసింది.

Security Alert: యాపిల్ యూజర్లకు రెడ్ అలర్ట్.. ప్రమాదంలో డేటా సెక్యూరిటీ.. వెంటనే ఇలా చేయండి..
Apple Iphone
Madhu
|

Updated on: Aug 05, 2024 | 5:57 PM

Share

మీరు యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటివి వినియోగిస్తున్నారా? అయితే మీకో బిగ్ అలర్ట్. మీ గ్యాడ్జెట్లు ప్రమాదంలో ఉన్నాయని భారత ప్రభుత్వ నోడల్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) 2024, ఆగస్టు 2న అధిక తీవ్రత రేటింగ్‌తో హెచ్చరికను జారీ చేసింది. ఐఫోన్‌లు, ఐప్యాడ్లు, మ్యాక్ లతో సహా యాపిల్ పరికరాలలోని ప్రధాన భాగాలను ప్రభావితం చేసే భద్రతా సమస్య ఏర్పడినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

హెచ్చరిక ఇది..

CERT-In ఏం చెబుతోందంటే.. యాపిల్ ఉత్పత్తులలో బహుళ భద్రతా సమస్యలు నివేదించింది. వీటి కారణంగా ఆయా గ్యాడ్జెట్లలోని సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, ఏకపక్ష కోడ్‌ని అమలు చేయడానికి, భద్రతా పరిమితులను దాటవేయడానికి, సేవా నిరాకరణకు (డీఓఎస్) అటాకర్ అవకాశం ఏర్పడుతందని పేర్కొంది. అంతేకాక వీటి ద్వారా తమ టార్గెట్ సిస్టమ్‌పై స్పూఫింగ్ చేయడానికి అటాకర్ కు అవకాశం ఏర్పడుతుందని వివరించింది. ఈ నేపథ్యంలో CERT-In ఒక డైరెక్టివ్ ని విడుదల చేసింది. దానిలో వినియోగదారులు యాపిల్ వెబ్‌సైట్‌లోని సపోర్ట్ పేజీలోకి వెళ్లి.. సమస్యల గురించి వివరంగా తనిఖీ చేయమని చెబుతోంది.

ఈ డివైజ్ లు వాడుతుంటే జాగ్రత్త..

  • యాపిల్ సఫారీ 17.6 కన్నా ముందు వెర్షన్లు.
  • యాపిల్ మ్యాక్ ఓఎస్ వెంచూరా 13.6.8కి ముందు వెర్షన్‌లు.
  • యాపిల్ మ్యాక్ ఓఎస్ సోనోమా 14.6కన్నా ముందు వెర్షన్లు.
  • యాపిల్ విజన్ ఓఎస్ 1.3 కన్నా ముందు వెర్షన్లు.
  • యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.6 కన్నా ముందు వెర్షన్లు.
  • యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 16.7.9కన్నా ముందు వెర్షన్లు.
  • యాపిల్ కొత్త విడుదల చేసిన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, విజన్ ప్రో హెడ్ సెట్ వంటి తాజా పరికరాల్లోని సాఫ్ట్ వేర్ కూడా ఈ సెక్యూరిటీ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.
  • మీరు వాటి సంబంధిత సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లతో జాబితాలో పేర్కొన్న ఐప్యాడ్, ఐప్యాడ్ ప్రో మోడల్‌ల శ్రేణిని కలిగి ఉన్నా.. లేక పాత ఐఫోన్ మోడళ్లు అయిన 8,8ప్లస్, ఐఫోన్ ఎక్స్ వంటివి వాడుతున్న వినియోగదారులు కూడా ఈ భద్రత ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలి.

యూజర్లు ఏం చేయాలంటే..

ఈ భద్రతా సమస్యలపై యాపిల్ సంస్థ ఇప్పటికే పరిష్కారాలు, ప్యాచ్‌లను అందించింది. అలాగే CERT-In కూడా ఐఫోన్, మ్యాక్స్, ఐప్యాడ్, సఫారీ బ్రౌజర్ వినియోగదారులను కొత్త అప్ డేట్ ల కోసం తనిఖీ చేయాలని కోరుతోంది. అందుకోసం మీరు పరికరంలోని సెట్టింగ్స్ కు వెళ్లి – సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కి వెళ్లి – ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్, మ్యాక్ ఓఎస్ వెర్షన్ల తాజా వెర్షన్లను ఇన్ స్టాల్ చేయొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..