Realme 13 4G: రియల్‌మీ మరో స్మార్ట్ ఫోన్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. పూర్తి వివరాలు..

ఇప్పుడు వీటికి అదనంగా మరో ఫోన్ ను తీసుకొచ్చేందుకు రియల్ మీ ఏర్పాట్లు చేస్తోంది. రియల్ మీ 13 4జీ పేరిట దీనిని లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆగస్టు ఏడో తేదీని ఇండోనేషియాలో ఈ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇది లాంచ్ అయిన తర్వాత ఆగస్టు ఎనిమిదో తేదీన ఫ్లాష్ సేల్ ప్రారంభమవుతుంది.

Realme 13 4G: రియల్‌మీ మరో స్మార్ట్ ఫోన్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. పూర్తి వివరాలు..
Realme 13 4g
Follow us

|

Updated on: Aug 05, 2024 | 5:17 PM

చైనాకు చెందిన టాప్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ తన కొత్త సిరీస్ రియల్ మీ 13 ప్రో ని ఇటీవలే లాంచ్ చేసింది. రియల్ మీ 13 ప్రో ప్లస్, రియల్ మీ 13 ప్రో పేరిట వీటిని ఆవిష్కరించింది. ఇవి స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ తో ఉన్నాయి. ఏఐ ఆడియో జూమ్, ఏఐ స్మార్ట్ రిమూవల్ వంటి కెమెరా ఫీచర్లతో వీటిని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు వీటికి అదనంగా మరో ఫోన్ ను తీసుకొచ్చేందుకు రియల్ మీ ఏర్పాట్లు చేస్తోంది. రియల్ మీ 13 4జీ పేరిట దీనిని లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆగస్టు ఏడో తేదీని ఇండోనేషియాలో ఈ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇది లాంచ్ అయిన తర్వాత ఆగస్టు ఎనిమిదో తేదీన ఫ్లాష్ సేల్ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..

టీజర్లోని సమాచారం ప్రకారం..

రియల్ మీ 13 4జీ రిలీజ్ టీజర్లో పలు ఆసక్తికర విషయాలను కంపెనీ వెల్లడించింది. రియల్ మీ ఇండోనేషియా టీజర్ వెబ్ సైట్ ప్రకారం ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 685 ఎస్ఓసీ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. అలాగే 120హెర్జ్ అమోల్డ్ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ 67 వాట్ల వరకూ చార్జ్ అవుతుంది. ఈ ఫోన్ పయోనీర్ గ్రీన్, స్కై లైన్ బ్లూ కలర్ ఆప్షన్ లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్లో 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 5000ఎంఏహెచ్ ఉంటుంది. సోనీ లిషియా ఎల్‌వైటీ 600 సెన్సార్ తో కూడిన పోర్ట్ రైట్ కెమెరాను లిగి ఉంటుంది.

గుర్తించాల్సింది ఇది..

ఆసక్తికరంగా.. ఈ రియల్ మీ 13 4జీ ఫోన్లో చిప్‌సెట్, కెమెరా, ర్యామ్ సైజ్, స్క్రీన్ రకం, రిఫ్రెష్ రేట్, బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ అన్నీ గత జూన్‌లో ప్రకటించిన రియల్ మీ 12 4జీ లో మనం చూసిన వాటికి సమానంగా ఉన్నాయి. కాబట్టి రియల్ మీ 13 4జీ కేవలం రీబ్యాడ్జ్ చేసిన రియల్ 12 4జీగా తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. దీనిని కొనుగోలు చేసే వ్యక్తులు తమ చివరి తరం ఉత్పత్తిని కలిగి ఉన్నట్లు భావించకూడదు. అయితే ఇక్కడ గమనించాల్సి అంశం ఏమిటంటే.. ఇవన్నీ పూర్తిస్థాయి సమాచారం కాదు. కేవలం ఊహాగానాలే.. పూర్తి స్థాయిలో అప్ డేట్స్ తెలియాలంటే లాంచింగ్ వరకూ ఆగాల్సిందే.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రియల్‌మీ మరో స్మార్ట్ ఫోన్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
రియల్‌మీ మరో స్మార్ట్ ఫోన్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
గొర్రెను చుట్టుకున్న కొండచిలువ.. షాకింగ్ వీడియో వైరల్‌..
గొర్రెను చుట్టుకున్న కొండచిలువ.. షాకింగ్ వీడియో వైరల్‌..
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ తింగరి పిల్ల..
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ తింగరి పిల్ల..
SL vs IND: మూడో వన్డే నుంచి ముగ్గురు ఔట్.. లిస్టులో ఎవరున్నారంటే?
SL vs IND: మూడో వన్డే నుంచి ముగ్గురు ఔట్.. లిస్టులో ఎవరున్నారంటే?
స్మార్ట్ టాయిలెట్ అంటే ఇదేనా..? నీ కష్టం పగవాడికి కూడా రావొద్దు
స్మార్ట్ టాయిలెట్ అంటే ఇదేనా..? నీ కష్టం పగవాడికి కూడా రావొద్దు
కప్పు కాఫీ తాగితే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా.?
కప్పు కాఫీ తాగితే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా.?
రూ. 10వేలలోపు ధరలో బెస్ట్ శామ్సంగ్ ఫోన్లు ఇవే..
రూ. 10వేలలోపు ధరలో బెస్ట్ శామ్సంగ్ ఫోన్లు ఇవే..
ఆర్‌జే శేఖర్ బాషాపై దాడి.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి వీడియో రిలీజ్
ఆర్‌జే శేఖర్ బాషాపై దాడి.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి వీడియో రిలీజ్
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. కేంద్ర ప్రభుత్వం నుంచి హెచ్చరిక..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. కేంద్ర ప్రభుత్వం నుంచి హెచ్చరిక..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. స్పెషల్ టూర్‌ ప్యాకేజీ, ఫ్లైట్‌లో
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. స్పెషల్ టూర్‌ ప్యాకేజీ, ఫ్లైట్‌లో