GST Council Meeting: జీఎస్టీ కౌన్సిల్‌‌లో చిరు వ్యాపారులకు మేలు చేసే నిర్ణయాలు.. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్..

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన 53వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది.. రాఫ్ట్రాల ఆర్ధికశాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీ నుంచి పయ్యావుల కేశవ్‌ , తెలంగాణ నుంచి భట్టి విక్రమార్క ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ , రేసింగ్‌ , క్యాసినోపై 28 శాతం జీఎస్టీ విధించాలన్న విషయంపై సమావేశంలో చర్చ జరిగింది.

GST Council Meeting: జీఎస్టీ కౌన్సిల్‌‌లో చిరు వ్యాపారులకు మేలు చేసే నిర్ణయాలు.. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్..
Nirmala Sitharaman
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 22, 2024 | 8:46 PM

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన 53వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది.. రాఫ్ట్రాల ఆర్ధికశాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీ నుంచి పయ్యావుల కేశవ్‌ , తెలంగాణ నుంచి భట్టి విక్రమార్క ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ , రేసింగ్‌ , క్యాసినోపై 28 శాతం జీఎస్టీ విధించాలన్న విషయంపై సమావేశంలో చర్చ జరిగింది. అలాగే, స్టాండింగ్ కమిటీ సిఫార్సులపై చర్చించారు. చిరు వ్యాపారులకు మేలు చేసేలా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్టు నిర్మల సీతారామన్‌ తెలిపారు. నకిలీ ఇన్‌వాయిస్‌లను తనిఖీ చేయడానికి పాన్-ఇండియా బయోమెట్రిక్ ప్రమాణీకరణను రూపొందించాలని నిర్ణయించామన్నారు.

ఆగస్ట్‌లో మరోసారి జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

ఆగస్ట్‌లో మరోసారి జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ఉంటుందన్నారు నిర్మల. పన్నులు కట్టే వాళ్లకు మేలు చేసేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. జీఎస్టీ సెక్షన్‌ 73 కింద డిమాండ్‌ నోటీసులు ఇచ్చామని , వచ్చే ఏడాది మార్చిలోగా పన్ను కట్టేవారికి మినహాయింపులు ఇస్తామని తెలిపారు. జీఎస్టీపై ట్రైబ్యునళ్లు, కోర్టులకు వెళ్లే ట్రాన్సాక్షన్ పరిమితి పెంచినట్టు చెప్పారు. జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలనే ప్రతిపాదనలు వచ్చాయన్నారు నిర్మలా సీతారమన్‌. ఫిర్యాదుల విషయంలో వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాం.. దీంతో వ్యాపారులకు , ఎంఎస్‌ఎంఈలకు , ట్యాక్స్‌ పేయర్లకు లాభం చేకూరుతుందని చెప్పారు.

సీజీఎస్టీ చట్టంలో సవరణలకు జీఎస్టీ కౌన్సిల్‌ ప్రతిపాదించింది. జీఎస్టీ కట్టేందుకు చివరితేదీ గడువు పొడిగించారు. ఈ నిర్ణయాలతో చిరువ్యాపారుల , ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. ఇన్‌పుట్ క్రెడిట్‌ ట్యాక్స్‌ విషయంలో మార్పులు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాలు జరగకుండా ఆధార్‌ అథెంటిఫికేషన్‌ తప్పనిసరి చేశారు. కార్బన్‌ బాక్సులపై జీఎస్టీ తగ్గించారు. ఈ నిర్ణయంతో యాపిల్‌, ఇతర పండ్ల వ్యాపారులకు మేలు కలుగుతుంది. స్ప్రింకర్లపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించారు.

కేంద్ర బడ్జెట్ పై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. భారత మండపంలో రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో కేంద్ర ఆర్ధికమంత్రి సమావేశం నిర్వహించారు. ఆర్థిక మంత్రులతో బడ్జెట్ ముందస్తు సన్నాహక సమావేశం జరిగింది. బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో సంప్రదింపులు జరిపారు నిర్మల సీతారామన్. రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల నుంచి వార్షిక బడ్జెట్‌పై సలహాలు సూచనలు తీసుకున్నారు ఆర్ధికమంత్రి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..