GST Council Meeting : 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం.. సమావేశంలో పాల్గొన్న అన్నిరాష్ట్రాల ఆర్థిక మంత్రులు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ నేతృత్వంలో 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది..
Nirmala Sitharaman GST Council Meeting : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ నేతృత్వంలో 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో అన్నిరాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొంటున్నారు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ నుండి తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ సమావేశానికి హాజరయ్యారు. ఇలాఉండగా, దేశంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు దిశానిర్దేశం చేసే పన్నుల నిర్ణాయక సంస్థ… జీఎస్టీ కౌన్సిల్. కరోనా కష్టకాలంలో ఆదాయాలు అడుగంటి పోతున్న ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగుతోంది. కరోనా వ్యాక్సిన్లు, వైద్య చికిత్సలు, ప్రాణరక్షణ ఔషధాలకు కూడా ప్రస్తుతం జీఎస్టీ విధిస్తున్నారు. అటు, వస్తు సేవల పన్ను విధానంపై రాష్ట్రాలకు ఇప్పటికే చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జీఎస్టీ మండలి సమావేశంలో జీఎస్టీ పన్నుల నుంచి కరోనా మందులకు ఉపశమనం కలిగే అవకాశం కనిపిస్తోంది. కాగా, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 43వ జీఎస్టీ మండలి సమావేశం యొక్క వివరాలు, తీసుకోబోతున్న నిర్ణయాలను ఈ రాత్రి 7 గంటలకు నిర్వహించబోతోన్న వీడియో సమావేశంలో వెల్లడించబోతున్నారు. ఈ మేరకు ఫైనాన్స్ మినిస్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
FM Smt. @nsitharaman to hold a media briefing on the outcomes of the 43rd GST Council meeting at 7 PM (tentative) in New Delhi today.
Watch LIVE here? YouTube➡️ https://t.co/oPDPocEsk3 Facebook➡️ https://t.co/06oEmkxGpI
Follow for LIVE updates Twitter➡️ https://t.co/XaIRg3fn5f
— Ministry of Finance (@FinMinIndia) May 28, 2021