GST: జనవరిలో 1.30 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూలు.. గతం కంటే 15 శాతం ఎక్కువ..
వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు 2022 జనవరిలోనూ 1.30 లక్షల కోట్లు దాటాయి. జనవరిలో 1.38 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.
వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు 2022 జనవరిలోనూ 1.30 లక్షల కోట్లు దాటాయి. జనవరిలో 1.38 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2022, జనవరి 30 నాటికి జీఎస్టీఆర్-3బీ రిటర్న్లు దాఖలైంది 1.05 కోట్లుగా తెలిపింది. దీంతో వరుసగా నాలుగో నెలలోనూ 1.30 లక్షల కోట్ల వసూళ్లు దాటినట్లయింది. జీఎస్టీ ద్వారా గత నెల మొత్తం రూ.1,38,394 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం వెల్లడించింది. 2021 జనవరితో పోల్చితే ఈ మొత్తం 15 శాతం ఎక్కువని తెలిపింది.
ఇందులో కేంద్ర జీఎస్టీ రూ.24,674 కోట్లు కాగా రాష్ట్రాల జీఎస్టీ రూ.32,016 కోట్లుగా ఉంది. సమీకృత జీఎస్టీ రూ.72,030 కోట్లు కాగా సెస్ రూ.9,674 కోట్లు వసూలు అయింది. ఇప్పటి వరకు అత్యధికంగా జీఎస్టీ వసూళ్లు 2021, ఏప్రిల్లో రూ.1,39,708 కోట్లుగా ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే.. 2022, జనవరిలో వసూలైన జీఎస్టీ.. 2021, జనవరితో పోలిస్తే 15 శాతం ఎక్కువగా ఉంది.
2020, జనవరితో పోలిస్తే 25 శాతం అధికమని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా కోలుకోవడం, జీఎస్టీ ఎగవేత వ్యతిరేక చర్యలు తీసుకోవడం కారణంగా జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
Read Also.. Budget-2022: బడ్జెట్-2022పై మైనింగ్ రంగం ఆశలు.. ఎగుమతి సుంకాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి..