Budget-2022: బడ్జెట్-2022పై మైనింగ్ రంగం ఆశలు.. ఎగుమతి సుంకాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి..

భారత మైనింగ్ రంగం గ్లోబల్ పీర్‌తో ధరల పెరుగుదలను ఎదుర్కొంది, ఆ తర్వాత ధరలు ఆకస్మికంగా తగ్గాయి....

Budget-2022: బడ్జెట్-2022పై మైనింగ్ రంగం ఆశలు.. ఎగుమతి సుంకాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి..
Mining
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 31, 2022 | 6:01 PM

భారత మైనింగ్ రంగం గ్లోబల్ పీర్‌తో ధరల పెరుగుదలను ఎదుర్కొంది, ఆ తర్వాత ధరలు ఆకస్మికంగా తగ్గాయి. డిమాండ్ నెమ్మదిగా పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇన్‌పుట్ ఖర్చులలోని అస్థిరతను భరించలేక, దేశీయ మైనింగ్ రంగానికి యూనియన్ బడ్జెట్-2022 ఊరటనివ్వాలని కోరుకుంటుంది. పర్యావరణ ఆందోళనలు, డిమాండ్ తగ్గడం, ఖర్చులు పెరగడం వంటి అనేక సమస్యలతో ఈ రంగం దెబ్బతింది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ కూడా మైనింగ్ రంగంపై ప్రభావాన్ని చూపింది. 2021 ఏప్రిల్-నవంబర్ కాలంలో దేశంలో ఖనిజ ఉత్పత్తి 2020 పోలిస్తే 18.2 శాతం వృద్ధిని కనబరిచినప్పటికీ, ఇనుము-ధాతువు, సున్నపురాయి, బాక్సైట్, రాగి ఉత్పత్తి 2021 నవంబర్ నెలలో తగ్గింది.

ఇనుప ఖనిజం ఎగుమతులపై విధిస్తున్న 15 శాతం ఎగుమతి సుంకాన్ని రద్దు చేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మినరల్ ఇండస్ట్రీస్ (FIMI) సమర్పించిన మెమోరాండంలో కోరింది. ఇనుప ఖనిజంపై ఎగుమతి సుంకం (58 శాతం వరకు ఇనుము-ధాతువు కలిగి ఉంటుంది) రద్దు చేయబడినప్పటికీ, 58 శాతం కంటే ఎక్కువ ఇనుము కలిగిన ఖనిజంపై ఇప్పటికీ 30 శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తున్నారు. బాక్సైట్ ఎగుమతులపై విధించే 15 శాతం ఎగుమతి సుంకాన్ని ఎత్తివేయాలన్న డిమాండ్ కూడా ఉంది. భారతీయ అల్యూమినియం ఉత్పత్తిదారులందరికీ తూర్పు లేదా మధ్య భారతదేశంలో స్వంత బాక్సైట్ గనులు ఉన్నాయి.

కోకింగ్, మెటలర్జికల్ కోక్ (మెట్ కోక్)పై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడం భారతీయ మెటలర్జికల్ రంగం ఆశిస్తున్న మరో అంశం. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలనే ఈ డిమాండ్ భారత ఉక్కు రంగానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 2.5 శాతం సుంకాన్ని (బేసిక్ కస్టమ్స్ డ్యూటీలో 1 శాతంతో సహా) 0 శాతానికి తగ్గించాలి. అయితే కోక్‌పై ప్రస్తుతం ఉన్న 5 శాతం నుండి 0 శాతానికి తగ్గించాలి. మెట్ కోక్ విషయంలో, ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని మార్చి 2015 నుండి 5 శాతానికి పెంచారు. అయితే యాంటీ డంపింగ్ డ్యూటీని నవంబర్ 2016 నుండి తగ్గించారు. అదేవిధంగా ఆంత్రాసైట్ బొగ్గు దిగుమతులపై సుంకాన్ని కూడా తగ్గించాలని FIMI డిమాండ్ చేసింది.

ముఖ్యంగా అల్యూమినియం పరిశ్రమ విషయంలో ప్రస్తుతం ఉన్న ఇన్‌వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌ను సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఖనిజ రంగం భావిస్తోంది. యూనియన్ బడ్జెట్-2022 ప్రతిపాదిత EU కార్బన్ పన్నుపై ఆధారపడి ఉంటుందా అనేది మరొక ప్రశ్న.

Read Also.. Budget 2022: పార్లమెంట్ ముందుకు ఆర్ధిక సర్వే.. దేశ ఆర్ధిక పరిస్థితి గురించి ఏం చెబుతోంది?

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్