Telagnana Manufacturing Hub: హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ.. డ్రిల్‌ మెక్‌స్పాతో రాష్ట్ర సర్కార్ ఒప్పందం

తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థతో MOU కుదుర్చుకుంది తెలంగాణ సర్కార్. ప్రపంచస్థాయి సంస్థలు తరలిరావడం సంతోషంగా ఉందని తెలంగాణ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు.

Telagnana Manufacturing Hub: హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ.. డ్రిల్‌ మెక్‌స్పాతో రాష్ట్ర సర్కార్ ఒప్పందం
Rig Maker Drillmec Spa
Follow us

|

Updated on: Jan 31, 2022 | 9:35 PM

Telangana govt MOU with Drillmec SPA: తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థతో MOU కుదుర్చుకుంది తెలంగాణ సర్కార్(Telangana government). ప్రపంచస్థాయి సంస్థలు తరలిరావడం సంతోషంగా ఉందని తెలంగాణ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు(Minister KTR) అన్నారు. త్వరలోనే హైదరాబాద్‌లోనే మరో తయారీ యూనిట్‌(Manufacturing Hub) ప్రారంభం కాబోతోంది. ఆయిల్‌ డ్రిల్లింగ్‌, రిగ్‌ సెక్టార్‌లో ప్రపంచ స్థాయి కంపెనీగా వెలుగొందుతున్న.. డ్రిల్‌ మెక్‌స్పా .. తెలంగాణలో రూ.15వందల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో రిగ్గుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఇవాళ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది.

తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచస్థాయి సంస్థలు తరలిరావడం, సీఎం కేసీఆర్‌ అద్భుత పాలనకు నిదర్శనమని మంత్రి కేటీఆర్ వివరించారు. హైదరాబాద్‌లో డ్రిల్‌మెక్‌ స్పా సంస్థతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఐటీ మంత్రి కేటీఆర్ ఉందన్నారు. 15 వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో ముందుకొచ్చిందని వివరించారు. ఈ పరిశ్రమ ద్వారా 2వేల 500 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని కేటీఆర్‌ వెల్లడించారు. దీంట్లో 80 శాతం వరకు స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చూస్తామని భరోసా ఇచ్చారు ఐటీ మంత్రి.

హైదరాబాద్‌లో డ్రిల్‌మెక్‌ సంస్థ తమ యూనిట్‌ ఏర్పాటు చేయడమే అద్భుత పాలనకు నిదర్శనమన్నారు. ఆయిల్‌, నేచురల్‌ గ్యాస్‌ వెలికితీసే మెషినరీ తయారు చేయడంలో ఈ కంపెనీకి వందేళ్లకు పైగా అనుభవం ఉందన్నారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థే ఈ డ్రిల్‌మెక్‌. దేశంలో నాలుగో అతిపెద్ద ఎకానమీ కంట్రిబ్యూటర్‌గా తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు కేటీఆర్. కానీ తమకు కేంద్రం నుంచి సహకారం కరవైందని చెప్పారు ఐటీ మంత్రి. ఏడున్నరేళ్లుగా రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని ఆరోపించారు కేటీఆర్. బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న దృష్ట్యా, హామీలు నిలబెట్టుకోవాలని ప్రధాని, ఆర్థికమంత్రికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని… తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ ఇండస్ట్రీయల్ రాయితీలు అందించాలని కోరారు. భారతదేశంలో నాలుగు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్న మంత్రి… కేంద్రం సహకరిస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు.

కాగా, డ్రిల్‌ మెక్‌స్పా ఆయిల్‌ రిగ్గులను తయారు చేసే సంస్థ. తెలంగాణలో సముద్రం తీరం లేదు, ఆయిల్‌ రిజర్వ్‌లు లేవు. డ్రిల్‌ మెక్‌స్పాకు రాష్ట్రంలో ప్రత్యక్ష వినియోగదారులు కూడా లేరు. అయినా ఇటలీ, యూఎస్‌ వంటి దేశాలను కాదని భారత్‌లో పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకోవడం…అందులోనూ దేశంలోని ఎన్నో రాష్ట్రాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందినా హైదరాబాద్‌నే ఎంచుకోవడం… ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ అద్భుత పాలనకు నిదర్శనమని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Read Also…  Andhra Pradesh PRC: ఏపీలో ముదుతున్న PRC పంచాయతీ.. మంత్రుల ప్రతిపాదనను తిరస్కరించిన ఉద్యోగ జేఏసీ!