IRCTC Refund: రైలు ప్రయాణికులకు శుభవార్త.. క్యాన్సిల్డ్ టిక్కెట్స్‌కు గంటలోనే మీ సొమ్ము వాపస్
భారతదేశంలో చౌకైన రవాణా సాధనంగా రైల్వే ప్రయాణం ప్రజల ఆదరణను పొందింది. భారతీయ రైల్వేల్లో ప్రతిరోజూ 2.4 కోట్ల మంది ప్రయాణిస్తూ ఉంటారు. దాదాపు రోజుకు 13,000 రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి. ముఖ్యంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) పోర్టల్ ద్వారా టిక్కెట్ బుకింగ్ కూడా సులభం అయింది. అయితే ఐఆర్‌సీటీసీ ద్వారా రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవడం సులభంగా ఉన్నా అనుకోని పరిస్థితుల్లో టిక్కెట్ క్యాన్సిల్ చేసుకున్నా, బుకింగ్ ఫెయిల్ అయినా సొమ్ము రీఫండ్ రావడానికి మూడు నుంచి ఐదు రోజులుల పడుతుంది.
భారతదేశంలో చౌకైన రవాణా సాధనంగా రైల్వే ప్రయాణం ప్రజల ఆదరణను పొందింది. భారతీయ రైల్వేల్లో ప్రతిరోజూ 2.4 కోట్ల మంది ప్రయాణిస్తూ ఉంటారు. దాదాపు రోజుకు 13,000 రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి. ముఖ్యంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) పోర్టల్ ద్వారా టిక్కెట్ బుకింగ్ కూడా సులభం అయింది. అయితే ఐఆర్‌సీటీసీ ద్వారా రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవడం సులభంగా ఉన్నా అనుకోని పరిస్థితుల్లో టిక్కెట్ క్యాన్సిల్ చేసుకున్నా, బుకింగ్ ఫెయిల్ అయినా సొమ్ము రీఫండ్ రావడానికి మూడు నుంచి ఐదు రోజులుల పడుతుంది. చాలా రోజులుగా ప్రయాణికులు ఈ సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు నివేదిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈసమస్యకు చెక్ పెట్టడానికి, కేవలం గంటలోనే రీఫండ్ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేలా కొత్త విధానాన్ని ఐఆర్‌సీటీసీ తీసుకుని వస్తుంది. ఐఆర్‌సీటీసీ రీఫండ్ విషయంలో తీసుకునే చర్యల గురించి మరిన్ని వివరాలను తెలుస్తుంది.
ఐఆర్‌సీటీలో రీఫండ్ ప్రక్రియ ప్రస్తుతం సుదీర్ఘంగా ఉంటుంది. బుకింగ్ విఫలమైనప్పుడు ఐఆర్‌సీటీ మరుసటి రోజు రీఫండ్ ప్రాసెస్‌ను ప్రారంభిస్తుంది. అయితే ఐఆర్‌సీటీసీ రీఫండ్‌ని ప్రాసెస్ చేస్తున్నప్పటికీ లావాదేవీని సెటిల్ చేయడానికి 3-4 పని దినాలు పడుతుంది కాబట్టి బ్యాంకులు లేదా చెల్లింపు గేట్‌వేలపై రీఫండ్ సమయం ఆధారపడి ఉంటుంది. తాజాగా రైల్వే అధికారులు రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆటోమేషన్ పద్ధతి ద్వారా క్యాన్సిల్ అయిన గంటలోనే రీఫండ్ జారీ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. త్వరలోనే ఈ కొత్త రీఫండ్ విధానం అమల్లోకి రానుంది.
ఐఆర్‌సీటీసీ, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రయత్నాల ద్వారా ఈ రీఫండ్ సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కొత్త విధానం ద్వారా గంటలోపే రీఫండ్‌లు ప్రాసెస్ చేసే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ కొత్త విధానం ఐఆర్‌సీటీసీకు లావాదేవీలను వేగంగా ప్రాసెస్ చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ప్రయాణికులకు వేగవంతమైన రీఫండ్ ద్వారా ప్రయాణికుల సమస్యకు చెక్ పడనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..