ఇకపై 9 గంటలే.! శ్రీలంకకు విమానం లాంటి ప్రయాణం.. ఎలాగంటారా

రోడ్డు, షిప్, రైలు, విమానం.. శ్రీలంకకు ఇలా వివిధ మార్గాల్లో ప్రయాణం చేయవచ్చు. ఏదైనా కూడా సమయం 12 గంటలు పైమాటే. కానీ ఇకపై ఆ కష్టం అక్కర్లేదు. చెన్నై నుంచి కేవలం 9 గంటల్లోనే శ్రీలంకకు వెళ్లిపోవచ్చు. అదెలా అని అనుకుంటున్నారా.?

ఇకపై 9 గంటలే.! శ్రీలంకకు విమానం లాంటి ప్రయాణం.. ఎలాగంటారా
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 03, 2024 | 7:30 PM

రోడ్డు, షిప్, రైలు, విమానం.. శ్రీలంకకు ఇలా వివిధ మార్గాల్లో ప్రయాణం చేయవచ్చు. ఏదైనా కూడా సమయం 12 గంటలు పైమాటే. కానీ ఇకపై ఆ కష్టం అక్కర్లేదు. చెన్నై నుంచి కేవలం 9 గంటల్లోనే శ్రీలంకకు వెళ్లిపోవచ్చు. ఇటీవల ప్రధాని మోదీ మూడు వందేభారత్ రైళ్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి చెన్నై టూ నాగర్‌కోయిల్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్.

చెన్నై నుంచి నాగర్‌కోయిల్‌ మధ్య ఉన్న 726 కిమీ దూరాన్ని కేవలం 8 గంటల 50 నిమిషాల్లోనే ఈ వందేభారత్ రైలు కవర్ చేస్తుంది. ఇక నాగర్‌కోయిల్ నుంచి, కన్యాకుమారి సుమారు 20 కి.మీ దూరంలో ఉంది. అక్కడ నుంచి శ్రీలంక మనం ఈజీగా వెళ్లిపోవచ్చు. అంటే దాదాపుగా 10 గంటల్లో శ్రీలంక చేరుకోగలం. ప్రస్తుతం ఈ రెండు రూట్ల మధ్య మరో రెండు రైళ్లు ప్రయాణిస్తున్నా.. అవి దాదాపు 12 గంటల సమయం పడుతుంది.

వారానికి ఆరు రోజులు నడిచే ఈ వందేభారత్ ట్రైన్.. చెన్నై ఎగ్మోర్ నుంచి ఉదయం 5 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 1.50 గంటలకు నాగర్‌కోయిల్ చేరుకుంటుంది. తాంబరం, విల్లుపురం, తిరుచిరాపల్లి, దిండిగల్, మదురై, కోవిల్‌పట్టి, తిరునల్వేలి స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు నాగర్‌కోయిల్‌లో మధ్యాహ్నం 2:20 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 11:00 గంటలకు చెన్నై ఎగ్మోర్ చేరుతుంది. కాగా, ఈ వందేభారత్ రైలు ట్రిచీ, మధురై, దిండిగల్, తిరునెల్వేలి పర్యాటక, పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా