Home Loan: హోమ్‌లోన్ ఖాతాదారులకు ఆ బ్యాంక్ శుభవార్త.. భారీగా వడ్డీ రేట్ల తగ్గింపు
ఇలాంటి వారిని ఆకట్టకోవడానికి బ్యాంకులు కూడా ప్రత్యేక వడ్డీలను ఆఫర్ చేస్తున్నారు. తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి చివరి త్రైమాసికం నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన గృహ రుణ రేట్లను 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.35 శాతానికి చేర్చింది. గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను కూడా బ్యాంక్ మాఫీ చేసింది,. ఈ మేరకు ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొంది.
సొంత ఇల్లు అనేది ప్రతి మధ్య తరగతి ఉద్యోగి కల. ఎన్ని రోజులున్నా అద్దె ఇంటి బాధలు తప్పవనే ఉద్దేశంతో ప్రతి నెలా చెల్లించే అద్దెకు కొంత నగదును జోడించి ఈఎంఐగా పెట్టుకుని హోమ్‌లోన్ తీసుకుని సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారిని ఆకట్టకోవడానికి బ్యాంకులు కూడా ప్రత్యేక వడ్డీలను ఆఫర్ చేస్తున్నారు. తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి చివరి త్రైమాసికం నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన గృహ రుణ రేట్లను 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.35 శాతానికి చేర్చింది. గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను కూడా బ్యాంక్ మాఫీ చేసింది. ఈ మేరకు ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా గృహ రుణ వడ్డీ రేట్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర(Bank Of Maharashtra) జనవరి 3న ఈ వడ్డీ తగ్గింపు ప్రకటన విడుదల చేసింది. ఆ రోజున ఆ బ్యాంకునకు చెందిన బీఎస్‌ఈబీ బీఓఎం షేర్లు 4.20 శాతం పెరిగి ఒక్కొక్కటి రూ. 47.35 వద్ద ముగిశాయి. అయితే కేవలం వడ్డీ రేట్ల తగ్గింపు మాత్రమే కాకుండా వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రాసెసింగ్ ఫీజులను కూడా బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర మినహాయించింది. అలాగే ఇతర బ్యాంకులకు పోటీనిచ్చేలా తక్కువ వడ్డీ రేట్లను బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర ఆఫర్ చేస్తుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర ఇప్పటికే న్యూ ఇయర్ ధమాకా ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ కింద ఇల్లు, కారు, రిటైల్ గోల్డ్ లోన్‌లకు ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేసింది.
బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర ఇప్పటికే 18.92 శాతం వృద్ధిని సాధించింది. తద్వారా డిసెంబర్ 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో రూ.4.34 లక్షల కోట్లను తాకింది. బ్యాంకు డిపాజిట్లలో 17.9 శాతం పెరుగుదలను రీచ్ అయ్యింది. అంటే ఈ మొత్తం రూ. 2.46 లక్షల కోట్లుగా ఉంది. స్థూల అడ్వాన్స్‌లలో 20.3 శాతం పెరుగుదలను, అంటే విలువ ఆధారంగా రూ.1.89 లక్షల కోట్లను బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర నమోదు చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..