Home Loan: సులువుగా గృహ రుణం ఇచ్చే బ్యాంకులు ఇవే.. వడ్డీ ఎక్కడ తక్కువంటే..

మీరు కనుక హోమ్ లోన్లు తీసుకునే ఆలోచనల్లో ఉంటే ప్రధాన దృష్టి సారించాల్సిన అంశం వడ్డీ రేటు. వీలైనంత తక్కువ వడ్డీ రేటుకు లోన్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతం చాలా బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో అందుబాటులో ఉన్న టాప్ బ్యాంకుల్లో హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను సరిపోల్చి చూద్దాం..

Home Loan: సులువుగా గృహ రుణం ఇచ్చే బ్యాంకులు ఇవే.. వడ్డీ ఎక్కడ తక్కువంటే..
Home Loan
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 23, 2023 | 6:03 PM

ఇల్లు కొనడం లేదా.. ఇల్లు కట్టుకోవడం అనేది సగటు మనిషి జీవితాశం. చాలా మంది దానిని నెరవేర్చుకోడానికి శయశక్తులా ప్రయత్నిస్తారు. అయితే ప్రస్తుతం పెరిగిపోయిన ఖర్చుల నేపథ్యంలో సంపాదనతోనే అది సాధ్యమవడం కష్టం. అందుకే అందరరూ హోమ్ లోన్ల బాట పడుతున్నారు. పెద్ద మొత్తంలో లోన్లు మంజూరవతుండటంతో, తక్కువ వడ్డీ ఉండటం, ఈఎంఐల రూపంలో చెల్లించే అవకాశం ఉండటంతో అందరూ వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. సాధారణంగా హోమ్ లోన్లు దీర్ఘకాలిక లోన్లు. వీటిని వడ్డీతో కలిపి చూస్తే.. మీరు తిరిగి చెల్లించే సమాయానికి అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉండే సందర్భాలు ఉంటాయి. మీరు తీసుకున్న వడ్డీ, కాల వ్యవధిని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది.  మీరు కనుక హోమ్ లోన్లు తీసుకునే ఆలోచనల్లో ఉంటే ప్రధాన దృష్టి సారించాల్సిన అంశం వడ్డీ రేటు. వీలైనంత తక్కువ వడ్డీ రేటుకు లోన్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతం చాలా బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో అందుబాటులో ఉన్న టాప్ బ్యాంకుల్లో హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను సరిపోల్చి చూద్దాం..

క్రెడిట్ స్కోర్ ప్రధానం..

వడ్డీ రేట్లను తెలుసుకునే ముందు.. రుణాల వడ్డీ రేట్లను ప్రభావితం చేసే ఓ అంశం గురించి తెలుసుకోవాలి. అదేంటంటే క్రెడిట్ స్కోర్. ఇది మీ రాబడి, ఖర్చులు, అప్పులు, ఈఎంఐల చెల్లింపులు, పాత లోన్ల వివరాలను క్రోడికరించి ఇస్తుంది. దీంతో బ్యాంకర్లు మీకు వడ్డీ రేటును నిర్ధారిస్తారు. సాధారణంగా ఇది 650 నుంచి 900 మధ్య ఉంటుంది. ఎంత ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే అంత తక్కువ వడ్డీ రేటు వచ్చే అవకాశం ఉంటుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. దేశంలో అతి పెద్ద రుణదాత అయిన ఎస్బీఐ రుణ దరఖాస్తు దారుడి క్రెడిట్ స్కోర్ ఆధారంగా 8.6 శాతం నుంచి 9.65 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు అత్యల్ప వడ్డీ రేటు 8.6 శాతంగా ఉంటుంది. 700, 749 మధ్య క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు 8.7 శాతం వడ్డీ రేటుతో రుణాలు ఇస్తారు. 650 నుం,ి 699 స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు 9.45 శాతం రుణాలు వస్తాయి. అలాగే 550 నుంచి 649 పరిధిలో స్కోర్ ఉన్నవారు 9.65 శాతం వద్ద గృహ రుణాలను పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ).. ఈ బ్యాంకులో గృహ రుణాలపై 8.40శాతం నుంచి 10.60 శాతం మధ్య వడ్డీ రేటు ఉంటుంది. కచ్చితమైన వడ్డీ రేట్లు దరఖాస్తుదారుల రుణ పరిమితి, క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఉంటాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ).. గృహ రుణాలను 8.40 శాతం నుంచి 10.10 శాతం మధ్య వడ్డీ రేటుతో పొందొచ్చు. కచ్చితమైన వడ్డీ రేటు ఎల్టీవీ (లోన్ టు వాల్యూ) నిష్పత్తి, లోన్ మొత్తం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఉంటుంది. అధిక ఎల్టీవీ నిష్పత్తి ఉంటే ఎక్కువ వడ్డీ, ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే వడ్డీ తగ్గుతుంది.

హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్.. అతిపెద్ద ప్రైవేట్ రుణదాత ఈ బ్యాంక్ సంవత్సరానికి 8.50శాతం నుంచి 9.15 శాతం మధ్య ప్రత్యేక వడ్డీ రేట్లలో గృహ రుణాలను అందిస్తోంది. ఈ రేట్లు జీతం పొందే వ్యక్తులు, స్వయం ఉపాధి పొందే వారికి కూడా వర్తిస్తాయి. ఈ రెండు వర్గాలకు ప్రామాణిక గృహ రుణ రేట్లు 8.75 శాతం నుంచి 9.40 శాతం మధ్య ఉంటాయి.

ఐసీఐసీఐ బ్యాంక్.. ప్రైవేట్ రుణదాత క్రెడిట్ స్కోర్ ఆధారంగా 9 నుంచి 9.10 శాతం మధ్య మారే వడ్డీ రేటుతో గృహ రుణాన్ని అందిస్తుంది. జీతం పొందే ఉద్యోగులు వారి రుణాలపై 9 శాతం వడ్డీ రేటుకు అర్హులు. స్వయం ఉపాధి పొందిన వ్యక్తులు 800 క్రెడిట్ స్కోర్‌పై 9 శాతం, క్రెడిట్ స్కోరు 750-800పై 9.10 శాతానికి లోన్ తీసుకోవచ్చు. ఈ ప్రత్యేక వడ్డీ రేట్లు డిసెంబర్ 31, 2023 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆ తర్వాత బ్యాంక్ ప్రామాణిక వడ్డీ రేట్లు 9.25 శాతం నుంచి 10.05 శాతం మధ్య ఉంటాయి.

వడ్డీ రేటుతో పాటు లోన్ తీసుకునే ముందు ఇతర చార్జీల వివరాలను కూడా తెలుసుకోవాలి. ప్రీ క్లోజర్ చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు, కస్టమర్ కేర్ సేవలు, కస్టమర్ సమీక్షల నాణ్యతను బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..