SBI Holders: కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.342 చెల్లిస్తే.. రూ.4 లక్షల బెనిఫిట్‌.. ఎలాగంటే..!

SBI Holders: బ్యాంకులు వినియోగదారులకు ఎన్నో పథకాలను అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెట్టిన పథకాలను ఆయా బ్యాంకులు..

SBI Holders: కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.342 చెల్లిస్తే.. రూ.4 లక్షల బెనిఫిట్‌.. ఎలాగంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 27, 2021 | 6:43 PM

SBI Holders: బ్యాంకులు వినియోగదారులకు ఎన్నో పథకాలను అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెట్టిన పథకాలను ఆయా బ్యాంకులు అమలు చేస్తున్నాయి. ఇక స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. రెండు ఇన్స్యూరెన్స్ పథకాల ద్వారా రూ.4 లక్షల వరకు బీమా సదుపాయాన్ని అందిస్తోంది. ఇందుకోసం కేవలం రూ.342 చెల్లిస్తే చాలు. ఈ వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది ఎస్‌బీఐ. కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ఇన్స్యూరెన్స్ తీసుకోవాలన్న ఆలోచన ప్రజల్లో పెరిగింది. ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ పథకాలపై తమ కస్టమర్లకు అవగాహన కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రెండు పథకాల ద్వారా కస్టమర్లు రూ.4 లక్షల బీమా ప్రయోజనాలు పొందవచ్చు.

ప్రధాన మంత్రి సురక్ష బీమా.. ఎస్‌బీఐ అందిస్తున్న మొదటి బీమా పథకం ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). ఈ స్కీమ్‌ ద్వారా రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. ఇది యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పాలసీ. ప్రతీ సంవత్సరం కేవలం రూ.12 ప్రీమియం చెల్లిస్తే చాలు. ఈ పాలసీ కస్టమర్‌ ఏదైనా ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల వరకు బీమా లభిస్తుంది. ఒక వేళ ప్రమాదంలో గాయపడి పూర్తిగా వికలాంగులుగా మారితే కూడా రూ.2 లక్షలు బీమా ద్వారా ఆదుకుంటుంది ప్రభుత్వం. పాక్షికంగా అంగవైకల్యం ఏర్పడితే రూ.1 లక్ష వరకు అందిస్తుంది. ఈ స్కీమ్‌లో చేరాలంటే 18 నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులు.

జీవన్ జ్యోతి బీమా యోజన: ఎస్‌బీఐ అందించేమరో స్కీమ్‌ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY). ఈ పాలసీ ద్వారా రూ.2 లక్షల బీమా లభిస్తుంది. ప్రతీ సంవత్సరం రూ.330 ప్రీమియం చెల్లించాలి. ఈ పాలసీ కస్టమర్‌ ఒకవేళ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు బీమా చెల్లిస్తుంది. ఇది టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు ఉన్నవారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీల ద్వారా జూన్ 1 నుంచి మే 31 వరకు ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పాలసీకి రూ.12, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీకి రూ.330 కలిపి మొత్తం రూ.342 ప్రీమియం చెల్లిస్తే రూ.4 లక్షల వరకు బీమా లభిస్తుంది. ఈ పాలసీలు తీసుకోవాలనుకునే కస్టమర్లు సమీపంలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి వివరాలు ఇవ్వాలి. వారికి ఎస్‌బీఐలో అకౌంట్ ఉండాలి. ఈ పాలసీ తీసుకున్న తర్వాత అకౌంట్ క్లోజ్ చేస్తే పాలసీ కూడా రద్దు అవుతుంది. ప్రతీ ఏటా గడువు లోగా ప్రీమియం చెల్లించడానికి అకౌంట్‌లో బ్యాలెన్స్ లేకపోయినా పాలసీ రద్దయ్యే అవకాశం ఉంది.

Sbi

Sbi

ఇవి కూడా చదవండి:

Bajaj Pulsar 250: అక్టోబర్ 28న కొత్త లుక్స్‌తో మార్కెట్లో విడుదల కానున్న బజాజ్‌ పల్సర్‌ 250.. ఫీచర్స్‌, ధర..!

Jio Fuel Station: రిలయన్స్‌ ఇండస్ట్రీ మరో సంచలనం.. పెట్రోల్‌ బంక్‌ల వ్యాపారంలోకి అడుగు పెట్టిన జియో..!