Cibil Score: క్రెడిట్ స్కోరు పెరగాలంటే ముందుగా ఈ 5 విషయాలు తెలుసుకోండి..

Cibil Score: CIBIL స్కోరు ఎక్కువగా ఉంటేనే బ్యాంక్‌ నుంచి లోన్స్‌ మంజూరవుతాయి. లేదంటే రిజెక్ట్ చేస్తారు. గృహ రుణం, వాహన రుణం, వ్యక్తిగత రుణం లేదా

Cibil Score: క్రెడిట్ స్కోరు పెరగాలంటే ముందుగా ఈ 5 విషయాలు తెలుసుకోండి..
Cibil Score
Follow us
uppula Raju

|

Updated on: Oct 12, 2021 | 9:36 AM

Cibil Score: CIBIL స్కోరు ఎక్కువగా ఉంటేనే బ్యాంక్‌ నుంచి లోన్స్‌ మంజూరవుతాయి. లేదంటే రిజెక్ట్ చేస్తారు. గృహ రుణం, వాహన రుణం, వ్యక్తిగత రుణం లేదా మరే ఇతర రుణం అయినా సరే బ్యాంకులు ఎల్లప్పుడూ CIBIL స్కోరును తనిఖీ చేస్తాయి. దీనినే క్రెడిట్ స్కోర్ అని కూడా అంటారు. ఇది ఒక పత్రం ఇందులో రుణగ్రహీత క్రెడిట్ ప్రవర్తన గురించి సమాచారం ఉంటుంది. ఈ సమాచారంతో బ్యాంకులు రుణాన్ని ఇవ్వాలా వద్దా నిర్ణయిస్తాయి. మీ క్రెడిట్ స్కోరు 750 కన్నా తక్కువ ఉంటే బ్యాంకులు మీ లన్‌ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తాయి. అందుకే మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండటం ముఖ్యం. అందుకోసం ఈ 5 విషయాలు తెలుసుకోండి.

1. రుణాన్ని సకాలంలో చెల్లించడం మీ క్రెడిట్ కార్డ్ బిల్లు లేదా లోన్ EMI సకాలంలో తిరిగి చెల్లించడం ముఖ్యం. డిఫాల్ట్ చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. మీరు లోన్‌ EMI ని చెల్లించడంలో విఫలమైతే పెనాల్టీ పడుతుంది. అంతేకాదు ఇది దీర్ఘకాలికంగా మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీ చెల్లింపులు సమయానికి చేయండి.

2. ఎక్కువ రుణం తీసుకోకండి మీరు ఒకేసారి ఎక్కువ రుణాలు తీసుకోకండి. మొదటిదాని తర్వాత రెండో రుణం తీసుకునేముందు మొదటి రుణాన్ని సకాలంలో చెల్లించండి. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గించదు. మీరు ఒకేసారి ఎక్కువ రుణం తీసుకుంటే దానిని తిరిగి చెల్లించడానికి మీకు తగినంత నిధులు అందుబాటులో ఉండవు. అప్పుడు డిఫాల్ట్‌గా మారి క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది.

3. సురక్షిత, అసురక్షిత రుణాలు జీవితంలో వివిధ అవసరాలను తీర్చేందుకు చాలామంది వివిధ రకాల రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మీరు రుణం తీసుకునేటప్పుడు అది సురక్షితమేనా లేదా అసురక్షితమైనదా తెలుసుకోవాలి. గృహ రుణం, కారు రుణం సురక్షిత రుణం కింద వస్తుంది. క్రెడిట్ కార్డ్ అప్పు లేదా వ్యక్తిగత రుణాలు అసురక్షిత రుణాల కిందకు వస్తాయి. అందువల్ల సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం.

4. క్రెడిట్ పరిమితిని మొత్తం ఖర్చు చేయవద్దు క్రెడిట్ స్కోర్‌ని మెరుగుపరిచే విషయానికి వస్తే బ్యాంకులు ఇచ్చిన పరిమితి వరకు మీ క్రెడిట్ కార్డును ఉపయోగించవద్దు. అందులో 30% మాత్రమే మీ కార్డుపై ఖర్చు చేయండి. ఉదాహరణకు మీ క్రెడిట్ పరిమితి నెలకు రూ .2 లక్షలు అయితే నెలవారీ ఖర్చులను రూ .60,000 వరకు కుదించండి.

5. క్రెడిట్ పరిమితిని పెంచండి మీకు క్రెడిట్ చెల్లింపులు ఎక్కువగా ఉంటే మీ క్రెడిట్ కార్డుపై క్రెడిట్ పరిమితిని పెంచమని బ్యాంక్‌ని కోరండి. క్రెడిట్ పరిమితిని పెంచడం అంటే మీ క్రెడిట్ కార్డుపై ఖర్చును పెంచడం కాదు.. క్రెడిట్‌ కార్డుపై ఇచ్చే డబ్బుల పరిమితిని పెంచమని. కానీ ఖర్చులను పరిమితంగా చేయాలి. అప్పుడే మీ CIBIL స్కోర్‌ మెరుగుపడుతుంది.

Honor killing: పార్టీ ఇస్తాం దా అని పిలిచారు.. ఆపై ప్రాణాలే తీసేశారు.. నిండు ప్రాణాన్ని బలిగొన్న ప్రేమ కథ..!