Gold Rates: తగ్గేదేలే.. కనకం వారి పాట లక్షన్నర..! అతివలంటే అంత పగనా బంగారమ్మ..
అమ్మో.. బంగారమే! అలుపన్నదే రాదా ఈ కనకానికి! పరుగులు తీయడమే వచ్చా పసిడికి..! అతివలు ఇక ఆశ వదులుకోవాల్సిందేనేమో బంగారంపైన. ఆలుమగలు, ప్రేమికులు ఆప్యాయంగా పిలుచుకునే పిలుపులోనే వినిపిస్తుందేమో ఇక.. బంగారం అనే మాట. మగువలు మానసికంగా ఎంత కుంగిపోతున్నారో అసలు. షాపింగ్‌కని బజార్‌కి వెళ్తే, అటుగా ఏదైనా బంగారం షాప్ కనిపిస్తే, ధగధగమని మెరిసిపోతున్న హారాలు కనిపిస్తే.. మనసు చివుక్కుమంటోంది.

ఇదసలే హార్ట్ అటాక్‌ల కాలం. ఎవరికొస్తుందో, ఎప్పుడొస్తుందో, ఎందుకొస్తుందో తెలియని రోజులివి. ఈ విషయం ఇంటి ఇల్లాలికి బాగా తెలుసు. ఇంటాయన్ని ‘బంగారం’ పిలవాల్సొచ్చినప్పుడు.. కాస్త ముందు వెనక ఆలోచించి, జాగ్రత్తగా పిలవడం బెటరేమో. బంగారం అంటోందో, బంగారం కావాలంటోందో అన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినా చాలు.. గుండెబద్దలవుతుంది. అంతగా భయాన్ని క్రియేట్ చేసింది బంగారం ధర. ఒకప్పటిలా.. బంగారం కొనిస్తారా అని అడిగే రోజుల్లేవ్ ఇప్పుడు. ప్రేమగా అయినా, డిమాండ్ చేయడానికైనా వీల్లేని పరిస్థితి కల్పించింది. మున్ముందు ఇంకా షాక్ ఇవ్వబోతోందట. అమ్మో.. బంగారమే! అలుపన్నదే రాదా ఈ కనకానికి! పరుగులు తీయడమే వచ్చా పసిడికి..! అతివలు ఇక ఆశ వదులుకోవాల్సిందేనేమో బంగారంపైన. ఆలుమగలు, ప్రేమికులు ఆప్యాయంగా పిలుచుకునే పిలుపులోనే వినిపిస్తుందేమో ఇక.. బంగారం అనే మాట. మగువలు మానసికంగా ఎంత కుంగిపోతున్నారో అసలు. షాపింగ్‌కని బజార్‌కి వెళ్తే, అటుగా ఏదైనా బంగారం షాప్ కనిపిస్తే, ధగధగమని మెరిసిపోతున్న హారాలు కనిపిస్తే.. మనసు చివుక్కుమంటోంది. ఇక ఇలా చూసి తరించాల్సిందేనా అనే బాధ వాళ్లది. ఆలయాలకు వెళ్లినప్పుడు ‘పునఃదర్శన ప్రాప్తిరస్తు’ అని కనిపిస్తుంది. అది చూడగానే ‘నిన్ను చూడాలన్నా, నిను చేరుకోవాలన్నా మానవమాత్రులం, మా వల్ల అవుతుందా’… ‘స్వామీ.. మళ్లీ నీ దగ్గరికి నువ్వే రప్పించుకో’ అని ప్రార్థించుకుంటాం. బంగారం వంక చూసి ఇలాగే ప్రార్థంచుకోవాల్సిన రోజులివి. ‘అమ్మా కనకమహాలక్ష్మి మా గోడు విను, నీ దరికి నువ్వే రప్పించుకో’ అని మనసులో...




