Gold Rate: ట్రంప్ దెబ్బకు పసిడి పరుగుకు బ్రేక్.. ఇంకా తగ్గే అవకాశం ఉందా?
అందుకోండి చూద్దాం అంటూ మిడిసిపడ్డ పసిడి గుండెజారి గల్లంతవుతోంది. ముట్టుకుంటే మాడిపోతామోనన్నంతగా పైపైకి ఎగబాకిన బంగారం ఇప్పుడు నేలపైకి దిగొస్తోంది. ఓ దశలో లక్ష రూపాయలు దాటుతుందనుకున్న బంగారం సమీప భవిష్యత్తులో కాస్త తక్కువ రేటు దొరికేలా ఉంది. కొత్తగా రాత్రికి రాత్రి బంగారపు కొండలేమీ కనిపెట్టలేదు. పెరుగుట విరుగటకొరకేనన్న నానుడి నిజమవుతోంది.

అసలే పెళ్లిళ్ల సీజన్. ప్రతి గృహిణి కోరుకునేది.. కావాలనుకునేది.. తగ్గితే చాలనుకునే వన్ అండ్ ఓన్లీ కోరిక.. బంగారం ధరలు. ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ ఇదే..! గత మూడు రోజులుగా బంగారం ధరలు ఏక్‌దమ్‌న కాకపోయినా.. నెమ్మదిగా అలా అలా పడుతూ వస్తోంది. ఇంకా పడిపోతే బాగుండుడని ప్రతి మధ్యతరగతి జీవి వెయిట్ చేస్తున్నాడు. మరి అక్షరాలా లక్ష రూపాయలు దాటొచ్చన్న విశ్లేషణల నేపథ్యంలో బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి..? ఈ మూడురోజుల పతనం వెనుక కారణమేంటి..? ఇంకా తగ్గే అవకాశం ఉందా? లేక ఇది మార్కెట్‌లో జరుగుతున్న డ్రామానా? ఇప్పుడు సగటు సామాన్యుడిని వేధిస్తున్న ప్రశ్న. ఏప్రిల్7నాటికి బంగారం ధరలు గత మూడు రోజుల్లో దాదాపు 4.58% తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏప్రిల్ 3న ఔన్స్ బంగారం ధర 3,167.62 డాలర్లు ఉంటే, ఇప్పుడది 3,021.52 డాలర్లకి దిగొచ్చింది. ఇక మనదేశంలో 24 క్యారెట్ బంగారం గ్రాము ధర రూ. 9,338 నుంచి రూ. 9,038కి పడిపోయింది. అంటే దాదాపు మూడురోజుల్లో 300రూపాయలు తగ్గింది. ఇంతలా బంగారం ధర తగ్గడానికి బిగ్ రీజన్ అమెరికా డాలర్. గత వారం, అంటే ఏప్రిల్ 4న ఒక బిగ్ డేటా అమెరికా మార్కెట్స్‌ను షేక్ చేసింది. అదే NFP.. US నాన్-ఫార్మ్ పేరోల్స్ రిపోర్ట్! ఈ రిపోర్ట్ ప్రకారం మార్చి 2025 నాటికి అమెరికాలో 2లక్షల28వేల కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఇది అంచనాల కంటే చాలా...