Gold Price: మహిళలకు గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..?
Gold and Silver Price Today in India: బంగారం కొనడానికి ముందు దాని ధరను తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. దుకాణాలలో లేదా ఆభరణాల వ్యాపారికి కాల్ చేసి, లేదా ఆన్‌లైన్‌లోనూ బంగారం రేట్లు తెలుసుకోవచ్చు. అయితే, బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి.

Gold Rate Today: బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని రోజులు తప్ప, ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం మార్కెట్ ముగిసే వరకు, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,23,700కి చేరింది. అయితే వెండి ధర కిలోగ్రాముకు రూ.1,64,500లకు చేరింది. శనివారం, ఆదివారం మార్కెట్ మూసి ఉంటుంది. కాబట్టి రెండింటిపైనా అదే ధర ఉండనుంది. మరోవైపు ఢిల్లీలో వెండి ధర రూ.8,500 పెరిగి కిలోగ్రాముకు రూ.1,71,500 కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. 99.9 శాతం (24 క్యారెట్లు), 99.5 శాతం (23 క్యారెట్లు) స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు వరుసగా రూ.600 తగ్గి రూ.1,26,000, రూ.1,25,400కి చేరుకుంది. IBJA ప్రకారం, 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం తాజా రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
24 క్యారెట్ల బంగారం: 10 గ్రాములకు రూ.1,23,700
22 క్యారెట్ల బంగారం: 10 గ్రాములకు రూ.1,13,390
18 క్యారెట్ల బంగారం: 10 గ్రాములకు రూ. 92,770
వెండి 999: కిలోకు రూ. 1,74,100
ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి ధరలు..
ప్రపంచవ్యాప్తంగా, స్పాట్ బంగారం ఔన్సుకు 16.61 డాలర్లు పెరిగి 3,992.80 డాలర్లకు చేరుకోగా, స్పాట్ వెండి ఔన్సుకు 1.52 శాతం పెరిగి 50.01 డాలర్లకు చేరుకుంది. గురువారం అంతర్జాతీయ మార్కెట్లో వెండి తొలిసారిగా ఔన్సుకు 51 డాలర్ల మార్కును దాటింది.
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (1 గ్రాముకు)..
| నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
|---|---|---|---|
| చెన్నై | రూ. 12,370 | రూ. 11,339 | రూ. 9,379 |
| ముంబై | రూ. 12,370 | రూ. 11,339 | రూ. 9,277 |
| ఢిల్లీ | రూ. 12,385 | రూ. 11,354 | రూ. 9,191 |
| కోల్‌కతా | రూ. 12,370 | రూ. 11,339 | రూ. 9,277 |
| బెంగళూరు | రూ. 12,370 | రూ. 11,339 | రూ. 9,277 |
| హైదరాబాద్ | రూ. 12,370 | రూ. 11,339 | రూ. 9,277 |
| కేరళ | రూ. 12,370 | రూ. 11,339 | రూ. 9,277 |
| పూణే | రూ. 12,370 | రూ. 11,339 | రూ. 9,277 |
| వడోదర | రూ. 12,375 | రూ. 11,344 | రూ. 9,181 |
| అహ్మదాబాద్ | రూ. 12,375 | రూ. 11,344 | రూ. 9,181 |
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో నేటి వెండి ధరలు..
| నగరం | 10 గ్రాములు | 100 గ్రాములు | 1 కేజీ |
|---|---|---|---|
| చెన్నై | రూ. 1,841 | రూ. 18,410 | రూ. 1,84,100 |
| ముంబై | రూ. 1,741 | రూ. 17,410 | రూ. 1,74,100 |
| ఢిల్లీ | రూ. 1,741 | రూ. 17,410 | రూ. 1,74,100 |
| కోల్‌కతా | రూ. 1,741 | రూ. 17,410 | రూ. 1,74,100 |
| బెంగళూరు | రూ. 1,741 | రూ. 17,410 | రూ. 1,74,100 |
| హైదరాబాద్ | రూ. 1,841 | రూ. 18,410 | రూ. 1,84,100 |
| కేరళ | రూ. 1,841 | రూ. 18,410 | రూ. 1,84,100 |
| పూణే | రూ. 1,741 | రూ. 17,410 | రూ. 1,74,100 |
| వడోదర | రూ. 1,741 | రూ. 17,410 | రూ. 1,74,100 |
| అహ్మదాబాద్ | రూ. 1,741 | రూ. 17,410 | రూ. 1,74,100 |
నిపుణులు ఏమంటున్నారు?
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకారం వెండి బుల్లిష్ ట్రెండ్‌లో ఉందని తెలిపింది. ఒక వైపు, వెండికి బలమైన డిమాండ్ ఉండగా, మరోవైపు సరఫరాలో కొరత ఏర్పడిందంట. ఫెడరల్ రిజర్వ్ కొత్త ద్రవ్య విధానాన్ని సూచించిందని, ఇది విలువైన లోహాలకు మద్దతునిచ్చిందని విశ్లేషకులు తెలిపారు. ప్రపంచ రిస్క్ సెంటిమెంట్ గణనీయంగా స్థిరీకరించబడే వరకు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతలు, USలో ఆర్థిక అనిశ్చితి, నిరంతర సరఫరా కొరత వెండి ర్యాలీని సమీప భవిష్యత్తులో కొనసాగించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర..
శుక్రవారం, బలమైన స్పాట్ డిమాండ్ మధ్య స్పెక్యులేటర్ల తాజా ఒప్పందాల కారణంగా ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.527 పెరిగి రూ.1,21,020కి చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో డిసెంబర్‌లో డెలివరీ కోసం ఒప్పందం ధర రూ.527 లేదా 0.44 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,21,020కి చేరుకుంది. గురువారం 10 గ్రాములకు రూ.1,20,493గా ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ రికార్డు స్థాయిలో పడిపోయాయి. విదేశీ మార్కెట్లో, డిసెంబర్ డెలివరీ కోసం కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు $26.50 లేదా 0.67 శాతం పెరిగి $3,999.10కి చేరుకుంది. బుధవారం, బంగారం ధర ఔన్సుకు US$4,081 రికార్డు స్థాయికి చేరుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




