Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి భారీ ఊరట.. స్థిరంగా కొనసాగుతున్న ధరలు.. ఈరోజు రేట్స్ ఇలా..

Gold Price on April 27th 2021: బంగారం కొనాలని భావిస్తున్న వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు.

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి భారీ ఊరట.. స్థిరంగా కొనసాగుతున్న ధరలు.. ఈరోజు రేట్స్ ఇలా..
Gold Price Today
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 27, 2021 | 6:49 AM

Gold Price on April 27th 2021: బంగారం కొనాలని భావిస్తున్న వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. గత కొన్నిరోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధరలకు గత రెండు రోజులుగా బ్రేక్ పడింది. దీంతో ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్న రేట్లు వరుసగా నెలవైపు చూస్తున్నాయి. బంగారం ధరలు పడిపోతున్నాయి. ఇక సోమవారం ఉదయం తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ అంటే మంగళవారం ఉదయం ఎలాంటి మార్పులు చోటు చేసుకోకుండా.. స్థిరంగా కోనసాగుతున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,940 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,940గా ఉంది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రధాన పట్టణాల్లో పసిడి ధరలు ఇలా..

1. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.44,590 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,650గా ఉంది. 2. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ. 46,240 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,460గా ఉంది. 3. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,940 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,940గా ఉంది. 4. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,590గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,650గా ఉంది. 5. ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,700గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,770గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకులలోని బంగారం ధరలలో మార్పు, స్టాక్ మార్కెట్స్ వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి.

Also Read: SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

సుకన్య సమృద్ధి యోజన 2021: పోస్టాఫీసులో వడ్డీ రేట్లు చెక్ చేయండిలా.. ప్రయోజనాలెంటో తెలుసా..

UPI: యూపీఐ అంటే ఏమిటి..? దీని ద్వారా లావాదేవీలు జరుపుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఆ స్మీమ్ టైం పొడగింపు..