Gold Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
Gold Rate Today: బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా దిగివస్తున్న పసిడి ధరలు.. మళ్లీ పరుగులు పెడుతున్నాయి. నిన్న..
Gold Rate Today: బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా దిగివస్తున్న పసిడి ధరలు.. మళ్లీ పరుగులు పెడుతున్నాయి. నిన్న స్వలంగా పెరిగిన బంగారం ధర.. తాజాగా బుధవారం కూడా పెరిగింది. 10 గ్రాముల ధరపై రూ.210 వరకు పెరిగింది. దేశంలో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ఇందుకు ప్రధాన కారణం పెళ్లిళ్ల సీజన్. అయితే కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం.. మళ్లీ పెరుగుతుందేమోనన్న ఆందోళనతో బంగారం కొనుగోళ్లు జరుపుతున్నారు. దేశంలో పరిస్థితులు మాత్రం బంగారం ధరలు తగ్గే సంకేతాలు ఇస్తున్నా.. మళ్లీ పెరుగుతున్నాయి. మరోవైపు కొందరు నిపుణులైతే దీపావళి నాటికి భారీగా పెరిగే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇక దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,570 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,570 వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాని నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,570 ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,570 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,570 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,520 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,570 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,520 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,980 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220 వద్ద కొనసాగుతోంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,200 ఉండగా, 24 క్యారెట్ల 48,220 వద్ద కొనసాగుతోంది.
కాగా, బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే వారు ధరలను తెలుసుకొని వెళ్లడం మంచిది.
అయితే నిజానికి దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశాలు ఇప్పుడు లేవు. ఎందుకంటే… ఏడాది నుంచి బంగారం కొనుగోళ్లు చాలా తగ్గిపోయాయి. విదేశాల నుంచి బంగారు దిగుమతులు కూడా తగ్గాయి. ప్రజల దగ్గర బంగారం, వెండి కొనేంత డబ్బు లేదు. కరోనా మహమ్మారి కారణంగా ఉన్న ఉద్యోగాలు పోయాయి. అందువల్ల ఎవరూ బంగారం కొనే పరిస్థితుల్లో లేరు. ఇంకా చెప్పాలంటే చాలా మంది డబ్బు కోసం బంగారం తాకట్టు పెట్టేస్తున్నారు. బంగారంపై పెట్టుబడులు కూడా బాగా తగ్గాయి. ఇలాంటప్పుడు బంగారానికి డిమాండ్ పడిపోయి ధరలు బాగా తగ్గాలి. కానీ గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
గత ఏడాది మార్చి నెలలో లాక్‌డౌన్ ప్రకటించాక… బంగారం ధరలు పెరగడం మొదలైంది. అలా పెరుగుతూ పెరుగుతూ… చివరకు ఆగస్టు 7 వరకూ పెరుగుతూనే వచ్చాయి. ఆ తర్వాత తగ్గుతూ… తగ్గుతూ… ఈ సంవత్సరం మార్చి 31 వరకూ తగ్గాయి. ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవ్వడం, దేశంలో కరోనా కేసులు పెరగడంతో… మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇది ఇన్వెస్టర్లకు కలిసొచ్చే అంశం అనే చెప్పాలి.