Gold Price Today: మహిళలకు షాకిస్తున్న పసిడి.. మళ్లీ లక్షకు చేరువలో బంగారం ధర
Gold Price Today: భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడి ఉంటాయి. దీనితో పాటు, రూపాయి-డాలర్ మారకం రేటు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడి, ప్రపంచ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, భారతీయ కొనుగోలుదారులకు వెండి..

మళ్లీ బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. గత కొన్ని రోజుల కిందట లక్ష రూపాయలకుపైగా వెళ్లిన బంగారం ధర.. తర్వాత దిగి వచ్చాయి. ఇప్పుడు మళ్లీ లక్ష రూపాయలకు ఎగబాకుతోంది. జూలై 12వ తేదీన బంగారం ధరలు పెరిగాయి. గత రెండు మూడు రోజుల నుంచి చూస్తే రూ.1500లకుపైగా పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,010 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,760 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ.1,11,100 వద్ద ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తెలుసుకుందాం..
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,160 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,910 వద్ద ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,010 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,760 వద్ద ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,010 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,760 వద్ద ఉంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,010 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,760 వద్ద ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,010 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,760 వద్ద ఉంది.
భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడి ఉంటాయి. దీనితో పాటు, రూపాయి-డాలర్ మారకం రేటు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడి, ప్రపంచ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, భారతీయ కొనుగోలుదారులకు ధరలు ఖరీదైనవి అవుతాయి. దీనితో పాటు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ధోరణులు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి. సాధారణంగా బంగారం, వెండి ధరలు ఒకే దిశలో కదులుతాయి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు, వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు, ఈ విలువైన లోహాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇది ధరలను కూడా పెంచుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




