Tesla India: భారత్ మార్కెట్‌లోకి టెస్లా ఎంట్రీ తేదీ ఖరారు… జూలై 15న ముంబైలో టెస్లా తొలి షోరూమ్ ప్రారంభం
అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించడం ఖరారైంది. భారత్‌లో తమ కార్ల విక్రయాలు ప్రారంభించడానికి మస్క్ కంపెనీ జులై 15న ముంబయిలో తొలి షోరూం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో టెస్లా షోరూంను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు...

అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించడం ఖరారైంది. భారత్‌లో తమ కార్ల విక్రయాలు ప్రారంభించడానికి మస్క్ కంపెనీ జులై 15న ముంబయిలో తొలి షోరూం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో టెస్లా షోరూంను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. ఇందుకోసం ఇప్పటికే 5 వై మోడల్ కార్లు ముంబయికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. చైనాలోని షాంఘై నుంచి వాటిని తీసుకొచ్చినట్లు సమాచారం. అనంతరం దిల్లీలోనూ మరో షోరూం ఏర్పాటుచేయడానికి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు 2021 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని మస్క్ కంపెనీ డిమాండ్ చేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలు కొనుగోలు చేయాలన్న షరతు పెట్టింది. ఇందుకు మస్క్ అభ్యంతరం వ్యక్తంచేయడంతో టెస్లా ఎంట్రీ ఆలస్యమవుతూ వచ్చింది.
2025 జులై.. కమింగ్‌సూన్ ఇండియా అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది టెస్లా. జులై 15న ఉదయం 10:30 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. లాంచింగ్ ఈవెంట్‌కి ఇప్పటికే ఆహ్వానాలు పంపింది టెస్లా. చైనా షాంఘై నుంచి ముంబై షోరూమ్‌కి ఇప్పటికే ఐదు Y మోడల్ కార్లు తరలించింది. అయితే దిగుమతి సుంకాలు తగ్గించాలని మస్క్ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా వెళ్లినప్పుడు మస్క్ జరిపిన చర్చలు ఫలించడంతో టెస్లా ఎంట్రీకి లైన్‌క్లియరైంది. దాంతో, ఇప్పుడు భారత్‌లోకి ఆఫీషియల్‌గా ఎంట్రీ ఇస్తోంది అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా




