Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. తులం గోల్డ్‌ రేట్‌ ఎంతంటే..?

Gold Price Today: పసిడి ప్రియులకు ఈ రోజు కొంచెం ఆశాజనకంగా ఉంది. నిన్న పెరిగిన బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. గత కొద్ది రోజులుగా బంగారం

Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. తులం గోల్డ్‌ రేట్‌ ఎంతంటే..?
Gold Price Today
Follow us
uppula Raju

|

Updated on: Nov 18, 2021 | 5:58 AM

Gold Price Today: పసిడి ప్రియులకు ఈ రోజు కొంచెం ఆశాజనకంగా ఉంది. నిన్న పెరిగిన బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీపావళీ.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పైపైకి వెళుతున్నాయి. తాజాగా గురువారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. దాదాపుగా రూ.250 వరకు తగ్గింది. దీంతో మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,900కు చేరింది. అలాగే 10 గ్రాముుల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,070కు చేరింది. దీంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ఈరోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,900ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,070కు చేరింది. అలాగే దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,250కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర గోల్డ్ రేట్ రూ. 46,250కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,450కు చేరింది. అలాగే ముంభైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,470కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,470కు చేరింది. ఇక విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,900ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,070కు చేరింది.

అయితే అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలలో మార్పులు.. కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు.. వాటీ వడ్డీ రేట్లు.. వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపే అంశాలు. ఇక గత కొద్ది రోజులుగా బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజూకీ స్వల్పంగా పసిడి ధరలు పెరుగుతూ బంగారం కొనాలనుకునేవారికి షాకిస్తున్నాయి.

విటమిన్‌ ‘E’ లేకుంటే శరీరంలో ఈ రెండు పనిచేయవు..! అందుకే ఈ 5 ఆహారాలు తప్పనిసరి..

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన 6 ఏళ్ల బాలిక.. ఏ విషయంలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

IND vs NZ: ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం