Gold Price Today: మళ్లీ తగ్గేదేలే అంటున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉందంటే..
Gold Price: ఈ మధ్య కాలం నుంచి వెండికి భారీ డిమాండ్ పెరిగింది. బంగారం లాగే వెండి కూడా పరుగులు పెడుతోంది. భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తర్వాత మళ్లీ తగ్గుతూ వస్తున్నాయి. కొంత మేరకు తగ్గాయి. అయితే గత నాలుగైదు..

Gold Price Today: బంగారం ధర మళ్లీ పరుగులు పెడుతోంది. తగ్గేదిలే అన్నట్లు దూసుకుపోతోంది. గత వారం రోజుల కిందట తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. మళ్లీ చుక్కలు చూపిస్తోంది. ఇటీవల కాలంలో తులం బంగారం ధర 1 లక్ష 30 వేలకు పైగా ఉన్న బంగారం ధర.. క్రమంగా తగ్గుతూ లక్షా 22 వేల దిగువన వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ క్రమ క్రమంగా పెరుగుతూ వస్తోంది. గత నాలుగైదు రోజుల నుంచి తులం బంగారం సుమారు 6 వేల రూపాయల వరకు ఎగబాకింది. కేవలం నిన్నటితో తులంపై ఏకంగా 2 వేల రూపాయలకుపైగా పెరిగింది. నవంబర్ 14న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,660 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,910 ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే దీని ధర నిన్న ఒక్క రోజు రూ.10 వేలు పెరిగిందంటే వెండి ఏ రేంజ్‌లో వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,73,100 ఉంది. అయితే ఒక్క రోజులోనే బంగారం, వెండి ధరల్లో ఇంత తేడా ఉండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. కనీసం గ్రాము బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Bank Account: చిన్న పొరపాటు.. బ్యాంకు అకౌంట్లో లక్ష కోట్లు బదిలీ.. తర్వాత ఏం జరిగిందంటే..
హైదరాబాద్:
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,630
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,910
ఢిల్లీ:
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,780
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,060
ముంబై:
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,660
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,910
చెన్నై:
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,830
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,010
బెంగళూరు:
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,630
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,910
ఈ మధ్య కాలం నుంచి వెండికి భారీ డిమాండ్ పెరిగింది. బంగారం లాగే వెండి కూడా పరుగులు పెడుతోంది. భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తర్వాత మళ్లీ తగ్గుతూ వస్తున్నాయి. కొంత మేరకు తగ్గాయి. అయితే గత నాలుగైదు రోజులుగా పసిడి, సిల్వర్ రేట్లు మళ్లీ పరుగులు పెడుతున్నాయి.
ఇది కూడా చదవండి: PM Kisan: ఆ రైతులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి రూ.4000 పీఎం కిసాన్ డబ్బులు!
ఇది కూడా చదవండి: Optical Illusion: మీ కంటికి పరీక్ష.. 11 సెకన్లలో ఈ చిత్రంలో ఉన్న జింక గుర్తిస్తే మీరు తోపు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం








