Public Holiday: నవంబర్ 14న పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు!
Public Holiday: నగరంలోని విద్యార్థులకు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందికి శుభవార్త. నవంబర్ 14వ తేదీన హైదరాబాద్ లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్. అయితే ఈ సెలవులు అన్ని పాఠశాలలకు కాదని గుర్తించుకోండి. ఎందుకంటే 14న జూబ్లీహిల్స్ టోట్ల లెక్కింపు జరగనుంది..

Public Holiday: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక దృష్ట్యా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్ని కార్యాలయాలు, సంస్థలకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు. ఈ సెలవు నవంబర్ 10, 11, 14 తేదీలలో మంజూరు చేశారు. ఉప ఎన్నికల పనుల కారణంగా నవంబర్ 10, 11 తేదీలకు ఇప్పటికే సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఓట్ల లెక్కింపు రోజు అయిన నవంబర్ 14కి కూడా సెలవు మంజూరు చేశారు జిల్లా కలెక్టర్.
ఇది కూడా చదవండి: Gold Price: మళ్లీ పసిడి రికార్డ్.. బంగారంపై రూ.2,290, వెండిపై రూ.10 వేలు పెంపు!
పోలింగ్ లేదా లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసిన కార్యాలయాలు, సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఉద్యోగులకు ఓటులో పాల్గొనడానికి, ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయడానికి అవకాశం కల్పించడం దీని ఉద్దేశ్యం.
చెల్లింపుతో కూడిన సెలవు మంజూరు:
కలెక్టర్ హరిచందన మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ లేదా లెక్కింపు కేంద్రాలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు చెల్లింపుతో కూడిన సెలవు వర్తిస్తుందని ఆయన వివరించారు. ఈ సెలవు ప్రధానంగా పాఠశాలలకు మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉంటారు. చాలా సందర్భాలలో ఈ పాఠశాలలు లేదా కార్యాలయాలలో ఓటింగ్ జరుగుతుంది. అదనంగా ఈ ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇచ్చారు.
ఆదేశాలు తప్పకుండా పాటించాలి:
పోలింగ్ కేంద్రాల చుట్టూ ఉన్న బార్లు మూసివేయబడతాయని, ఆహార పంపిణీ లేదా ఇతర కార్యకలాపాలకు అనుమతి ఉండదని కలెక్టర్ పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు సంయమనం పాటించి సహకరించాలన్నారు. పోలింగ్ కేంద్రాలు లేదా లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసిన విభాగాలు, సంస్థల అధిపతులు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని, అవసరమైన చర్యలు తప్పవన్నారు.
ఇది కూడా చదవండి: Electric Scooter: రూ. 41,999కే ఎలక్ట్రిక్ స్కూటర్.. నెలకు ఈఎంఐ రూ.2,182.. లైసెన్స్ అవసరం లేదు.. మైలేజీ, ధర వివరాలు!
ఇది కూడా చదవండి: PM Kisan: ఆ రైతులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి రూ.4000 పీఎం కిసాన్ డబ్బులు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం




