Gold Price Today: పండుగ వేళ పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. ప్రత్యేకించి దీపావళీ ధన్‌తేరాస్ సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. దీంతో అందరి ద‌ృష్టి బంగారం, వెండి ధరలపైనే ఉంటుంది. అయితే, అంతర్జాతీయ పరిణామాల ప్రకారం పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి.

Gold Price Today: పండుగ వేళ పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
Gold Price Today
Follow us

|

Updated on: Nov 11, 2023 | 6:29 AM

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. ప్రత్యేకించి దీపావళీ ధన్‌తేరాస్ సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. దీంతో అందరి ద‌ృష్టి బంగారం, వెండి ధరలపైనే ఉంటుంది. అయితే, అంతర్జాతీయ పరిణామాల ప్రకారం పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. తాజాగా, బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. శనివారం (నవంబర్ 11) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,000 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,090 లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.300, 24 క్యారెట్లపై 330 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.800 మేర పెరిగి.. 74,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,240 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,000, 24 క్యారెట్ల ధర రూ.61,090, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,000, 24 క్యారెట్లు రూ.61,090, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56,450, 24 క్యారెట్ల ధర రూ.61,580, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,000, 24 క్యారెట్ల ధర రూ.61,090, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,000, 24 క్యారెట్ల ధర రూ.61,090 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో రేట్లు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,090 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,000, 24 క్యారెట్ల ధర రూ.61,090 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,000 లుగా ఉంది. ముంబైలో రూ.74,000, చెన్నైలో రూ.77,000, బెంగళూరులో రూ.72,750, కేరళలో రూ.77,000, కోల్‌కతాలో రూ.74,000 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.77,000, విజయవాడలో రూ.77,000, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,000 లుగా ఉంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే.!
అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే.!
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
బాబోయ్‌.. మహిళ ముక్కులో వందల పురుగులు! ఖంగు తిన్న వైద్యులు
బాబోయ్‌.. మహిళ ముక్కులో వందల పురుగులు! ఖంగు తిన్న వైద్యులు
మోదీ పర్యటనతో బీజేపీలో ఫుల్ జోష్..
మోదీ పర్యటనతో బీజేపీలో ఫుల్ జోష్..
బ్రౌన్ బ్రెడ్‌తో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..
బ్రౌన్ బ్రెడ్‌తో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..
యూట్యూబ్‌లో కొత్త ఏఐ ఫీచర్లు.. ఎలా వాడాలో తెలుసా..
యూట్యూబ్‌లో కొత్త ఏఐ ఫీచర్లు.. ఎలా వాడాలో తెలుసా..