తొలి విడత గోల్డ్‌ బాండ్లపై పెట్టుబడి పెట్టినవారికి అదిరిపోయే రిటర్న్స్‌

తొలి విడత గోల్డ్‌ బాండ్లపై పెట్టుబడి పెట్టినవారికి అదిరిపోయే రిటర్న్స్‌

Phani CH

|

Updated on: Nov 10, 2023 | 8:39 PM

గోల్డ్‌ బాండ్లపై పెట్టుబడి పెట్టినవారికి గుడ్‌ న్యూస్‌. వీరికి అదిరిపోయే రిటర్స్‌ రానున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రవేశ పెట్టిన సావరిన్‌ గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడి పెట్టినవారికి డబుల్‌ కాదు.. ట్రిపుల్ రిటర్స్న్‌ రానున్నాయి. అయితే ఇది బాండ్లు విడుదల చేసిన తొలి విడతలో ఇన్వెస్ట్‌ చేసినవారికి మాత్రమే వర్తిస్తుంది. దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలనే ఉద్దేశంతో 2015లో ఆర్బీఐ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 8 ఏళ్ల కాలపరిమితితో తీసుకొచ్చిన ఈ బాండ్ల గడువు ఈ ఏడాది నవంబర్‌ 30తో ముగుస్తుంది.

గోల్డ్‌ బాండ్లపై పెట్టుబడి పెట్టినవారికి గుడ్‌ న్యూస్‌. వీరికి అదిరిపోయే రిటర్స్‌ రానున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రవేశ పెట్టిన సావరిన్‌ గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడి పెట్టినవారికి డబుల్‌ కాదు.. ట్రిపుల్ రిటర్స్న్‌ రానున్నాయి. అయితే ఇది బాండ్లు విడుదల చేసిన తొలి విడతలో ఇన్వెస్ట్‌ చేసినవారికి మాత్రమే వర్తిస్తుంది. దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలనే ఉద్దేశంతో 2015లో ఆర్బీఐ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 8 ఏళ్ల కాలపరిమితితో తీసుకొచ్చిన ఈ బాండ్ల గడువు ఈ ఏడాది నవంబర్‌ 30తో ముగుస్తుంది. బాండ్ల మెచ్యూరిటీపై ధరను ఇంకా నిర్ణయించనప్పటికీ.. ప్రస్తుత బంగారం ధరతో లెక్కిస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ఈ గోల్డ్‌ బాండ్లను జారీ చేస్తుంటుంది. ఇందుకోసం సబ్‌స్క్రిప్షన్‌ తేదీలను ప్రకటిస్తుంది. గ్రాము ధర నిర్ణయించేందుకు సబ్‌స్క్రిప్షన్‌ ముందు వారం చివరి మూడు పనిదినాల్లో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ నిర్ణయించిన సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇప్పుడు మెచ్యూరిటీ విషయంలోనూ అది వర్తించనుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూలీని లక్షాధికారిని చేసిన వజ్రం.. 10 లక్షల నగదు, ఐదు తులాల బంగారం ఇచ్చి కొన్న వ్యాపారి

గుండెపోటుతో యజమాని మృతి.. పొలం నుంచి పరుగున వచ్చిన ఆవు ఏం చేసిందంటే ??