గుండెపోటుతో యజమాని మృతి.. పొలం నుంచి పరుగున వచ్చిన ఆవు ఏం చేసిందంటే ??

గుండెపోటుతో యజమాని మృతి.. పొలం నుంచి పరుగున వచ్చిన ఆవు ఏం చేసిందంటే ??

Phani CH

|

Updated on: Nov 10, 2023 | 8:36 PM

ప్రేమాభిమానాలు మనుషుల్లేనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ ఉంటాయని, తమకూ మనసు ఉంటుందనీ మరోసారి నిరూపించింది ఓ ఆవు. తనకు ప్రతిరోజూ ఎంతో ప్రేమగా ఆహారం పెట్టి పోషించే యజమాని ఇంటివద్ద ఒక్కసారిగా కుప్ప కూలిపోతే ఎక్కడో పొలంలో ఉన్న ఆవు పరుగు పరుగున వచ్చింది. యజమాని గాజుపెట్టెలో అచేతనంగా పండి ఉంటే చూసి చలించిపోయింది. అంబా అంటూ అరుస్తూ మృతదేహం వద్ద తిరుగుతుంటే చూపరులను కంటతడి పెట్టించింది.

ప్రేమాభిమానాలు మనుషుల్లేనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ ఉంటాయని, తమకూ మనసు ఉంటుందనీ మరోసారి నిరూపించింది ఓ ఆవు. తనకు ప్రతిరోజూ ఎంతో ప్రేమగా ఆహారం పెట్టి పోషించే యజమాని ఇంటివద్ద ఒక్కసారిగా కుప్ప కూలిపోతే ఎక్కడో పొలంలో ఉన్న ఆవు పరుగు పరుగున వచ్చింది. యజమాని గాజుపెట్టెలో అచేతనంగా పండి ఉంటే చూసి చలించిపోయింది. అంబా అంటూ అరుస్తూ మృతదేహం వద్ద తిరుగుతుంటే చూపరులను కంటతడి పెట్టించింది. ఈ ఘటన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో పోతురాజు సత్యనారాయణమూర్తి అనే వ్యక్తి గుండె పోటుతో మృది చెందాడు. ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చుట్టు పక్కలవారంతా అక్కడికి చేరి విచారం వ్యక్తం చేశారు. ఈ విషయం ఆయన పుట్టినప్పటినుంచి కన్నబిడ్డలా పెంచుకుంటున్న ఆవుకు ఎలా తెలిసిందో కానీ, పొలంలో ఉన్న ఆవు పరుగు పరుగున యజమాని ఇంటికి వచ్చింది. గట్టిగా అరుస్తూ యజమాని మృత దేహం వద్దే తిరుగాడింది. ఈ ఘటన కుటుంబ సభ్యులను,బంధువులను కన్నీటి పర్యంతం చేసింది. మూగజీవికి యజమాని పట్ల ఉన్న అభిమానానికి అందరూ ఆశ్చర్యపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆగిఉన్న లారీని ఢీకొట్టిన బైక్‌.. మానవత్వం చాటుకున్న జిల్లా ఎస్పీ..

బావిలో పడిన శునకం.. కాపాడేందుకు హైదరాబాద్‌నుంచి స్పెషల్‌ టీం

ఫ్లైట్ లో తెలుగు మహిళపై లైంగిక వేధింపులు.. తోటి ప్రయాణికుడే..

రైలు పట్టాల మధ్య టపాసులు కాల్చిన యూట్యూబర్‌

Vande Sadharan: త్వరలో పట్టాలెక్కనున్న‘వందే సాధారణ్‌’ రైళ్లు.. ట్రయల్‌ రన్‌ విజయవంతం