కూలీని లక్షాధికారిని చేసిన వజ్రం.. 10 లక్షల నగదు, ఐదు తులాల బంగారం ఇచ్చి కొన్న వ్యాపారి
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో తెలియదు. కటిక దారిద్రం అనుభవిస్తున్నవారిని కూడా అపర కోటీశ్వరులను చేసేస్తుంది. అలా ఓ వ్యవసాయ కూలీని అదృష్టం రాత్రికి రాత్రి లక్షాధికారిని చేసేసింది. అదృష్ట లక్ష్మి ఆమె తలుపు తట్టింది. పొలంలో కూలి పని చేస్తుండగా వజ్రం దొరకడంతో తన జీవితమే మారిపోయింది. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో వర్షం పడిందంటే చాలు వజ్రాల అన్వేషణ మొదలవుతుంది.
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో తెలియదు. కటిక దారిద్రం అనుభవిస్తున్నవారిని కూడా అపర కోటీశ్వరులను చేసేస్తుంది. అలా ఓ వ్యవసాయ కూలీని అదృష్టం రాత్రికి రాత్రి లక్షాధికారిని చేసేసింది. అదృష్ట లక్ష్మి ఆమె తలుపు తట్టింది. పొలంలో కూలి పని చేస్తుండగా వజ్రం దొరకడంతో తన జీవితమే మారిపోయింది. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో వర్షం పడిందంటే చాలు వజ్రాల అన్వేషణ మొదలవుతుంది. ఇక్కడ వజ్రాలు వెతుక్కుని తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. గత రెండు రోజులుగా కర్నూలు జిల్లాలో చిన్నపాటి వర్షం కురిసింది. ఈ క్రమంలో జొన్నగిరి గ్రామంలో పొలంలో పనులు చేసుకుంటున్న ఓ మహిళకు మెరుస్తూ ఓ రాయి కనిపించింది. దానిని వజ్రంగా భావించిన మహిళ.. ఆ రాయిని తీసుకొని స్థానిక వజ్రాల వ్యాపారిని కలిసింది. దానిని వజ్రంగా నిర్ధారించిన వ్యాపారి, 10 లక్షల నగదు ఐదు తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుండెపోటుతో యజమాని మృతి.. పొలం నుంచి పరుగున వచ్చిన ఆవు ఏం చేసిందంటే ??
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

