Gold Price Today: బంగారానికి మళ్లీ రెక్కలొచ్చాయి.. భారీగా పెరగిన గోల్డ్ రేట్.. ధరలు ఇలా ఉన్నాయి..
Gold Price Today: గతకొన్ని రోజులుగా స్వల్ప వ్యత్యాసంతో పెరుగుతు, తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు తాజాగా ఒకేసారి భారీగా పెరిగాయి. లాక్‌డౌన్ సమయంలో...
Gold Price Today: గతకొన్ని రోజులుగా స్వల్ప వ్యత్యాసంతో పెరుగుతు, తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు తాజాగా ఒకేసారి భారీగా పెరిగాయి. లాక్‌డౌన్ సమయంలో ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అయితే తాజాగా మళ్లీ బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గురువారం ఒక్క రోజే దేశ వ్యాప్తంగా భారీగా ధరల పెరుగుదల కనిపించింది. తాజాగా దేశ వ్యాప్తంగా 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి.
* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 43,800గా ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ విషయానికొస్తే.. రూ.610 పెరిగి రూ.47,790 వద్ద కొనసాగుతోంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ధరల విషయంలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 43,710గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,370గా ఉంది. * తమిళనాడు రాజధాని చెన్నైలోనూ ధరల విషయంలో పెరుగుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 640 పెరిగి రూ.42,380గా ఉంది. ఇక 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం విషయానికొస్తే.. ఏకంగా రూ.660 పెరిగి, రూ.46,200 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..
* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.550 పెరిగి రూ.41,650 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 600 పెరిగి.. రూ.45,440 వద్ద కొనసాగుతోంది. * విజయవాడలో పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 550 పెరిగి రూ.41,650గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే.. రూ. 45,440 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలోనూ బంగారం ధరల విషయంలో పెరుగుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రూ. 41,650గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.45,440 వద్ద కొనసాగుతోంది.
Also Read: World’s Costliest Vegetable: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట.. కిలో అక్షరాల లక్ష..
Vodafone Idea: జనవరిలో భారీస్థాయిలో వినియోగదారులను కోల్పోయిన వోడాఫోన్ ఐడియా