Reliance Jio: వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్.. ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ఇలా రీచార్జ్ చేసుకోండి.!

Jio Recharge Plans: మీరు జియో సిమ్ ఉపయోగిస్తున్నారా.? ప్రతీ నెలా రీచార్జ్ చేసుకుంటున్నారా.! అయితే కాస్త ఆలోచించండి. నెలవారీ రీచార్జ్‌ల కంటే...

Reliance Jio: వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్.. ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ఇలా రీచార్జ్ చేసుకోండి.!
Follow us

|

Updated on: Apr 01, 2021 | 7:20 PM

Jio Recharge Plans: మీరు జియో సిమ్ ఉపయోగిస్తున్నారా.? ప్రతీ నెలా రీచార్జ్ చేసుకుంటున్నారా.! అయితే కాస్త ఆలోచించండి. నెలవారీ రీచార్జ్‌ల కంటే ఒకేసారి ఏడాది ప్లాన్‌కు మారిపోతే.. మీ డబ్బు ఆదా కావడమే కాకుండా.. ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా చూసే అవకాశం కూడా దొరుకుతుంది. మరి ఆ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

జియో తన వినియోగదారుల కోసం మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. వీటితో మీరు ఏడాది పాటు అపరిమిత కాల్స్, డేటా, ఇతర ప్రయోజనాలను ఉపయోగించుకోవచ్చు. ఆ ప్లాన్స్ ఇలా ఉన్నాయి. రూ. 2121, రూ. 2399, రూ. 2599గా జియో నిర్దేశించింది. ఈ అన్ని ప్లాన్‌లతో మీకు JioTV, JioCinema, Jio Movies వంటి యాప్స్‌ను ఉచితంగా పొందవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

రూ .2121 జియో ప్లాన్…

ఈ ప్లాన్ 336 రోజులు చెల్లుబాటులో ఉంటుంది. ప్రతిరోజూ 1.5 జీబీ డేటా పొందవచ్చు. అంటే ఏడాది కాలంలో మొత్తం 504GB డేటాను సద్వినియోగం చేసుకోవచ్చు. దీనితో పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి.

2399 రూపాయల జియో ప్లాన్…

రూ .2399 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజూ 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమిత కాల్స్ లభిస్తాయి. అంటే, ఈ ప్లాన్ కింద ఏడాదిలో 730 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది.

2599 రూపాయల జియో ప్లాన్…

ఈ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా, రోజుకు 2GB డేటా, 10GB అదనపు డేటా లభిస్తుంది. రోజువారీ డేటా అయిపోయిన తర్వాత మీరు 64 Kbps వేగంతో ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు. వ్యాలిడిటీ సంవత్సరం. అంతేకాకుండా రోజుకు 100SMS, అపరిమిత వాయిస్ కాల్స్ కూడా పొందవచ్చు. ఈ అన్ని ప్లాన్స్‌కు డిస్నీ + హాట్‌స్టార్‌తో పాటు జియోటివి, జియో సినిమా, జియోన్యూస్, జియో సెక్యూరిటీ, జియోక్లౌడ్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు.

Also Read:

ఏపీలో మరోసారి పడగ విప్పిన కరోనా.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో అత్యధికం.!

LPG Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతంటే.!

అలెర్ట్: ఆధార్‌తో పాన్ కార్డు లింక్.? చివరి తేదీ పొడిగింపు.. వివరాలివే.!

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్.. మరో గుడ్ న్యూస్..!