AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: వామ్మో.. 2026లో బంగారం ధర అంత ఉంటుందా.. బాబా వంగా సంచలన జోస్యం

బంగారం ధర అంతకంతకూ పెరుగుతూ ప్రజలకు షాక్ మీద షాకులు ఇస్తుంది. ఇప్పటికే తులం బంగారం లక్షా 30వేలకు చేరుకుంది.ఈ నేపథ్యంలో 2026 నాటికి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బాబా వంగా ప్రవచనాల ప్రకారం.. 2026లో బంగారం ధరలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Gold Price: వామ్మో.. 2026లో బంగారం ధర అంత ఉంటుందా.. బాబా వంగా సంచలన జోస్యం
Baba Vanga Gold Price Prediction
Krishna S
|

Updated on: Oct 24, 2025 | 5:47 PM

Share

దేశంలో ఆర్థిక భద్రతకు పునాదిగా భావించే బంగారంపై ఇటీవల మళ్లీ అందరి దృష్టి పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియాలో బంగారం ధర 10 గ్రాములకు రూ.లక్ష మార్కును తాకి, కొత్త రికార్డు సృష్టించడం దీనికి కారణం. అయితే 2026 నాటికి బంగారం ధరలు ఎక్కడికి చేరుకోవచ్చు? ఈ విషయంలో బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా అంచనాలు ఏమిటి..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రపంచ ఆర్థిక సంక్షోభం!

ప్రపంచంలోని భవిష్యత్ అంచనాలకు ప్రసిద్ధి చెందిన బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా ప్రవచనాల ప్రకారం.. 2026లో ప్రపంచం ఒక పెద్ద బ్యాంకింగ్ లేదా ఆర్థిక గందరగోళం వైపు పయనించే అవకాశం ఉంది. దీంతో సంప్రదాయ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిని, ప్రపంచవ్యాప్తంగా నగదు కొరత ఏర్పడవచ్చని భావిస్తున్నారు. చారిత్రక ఆధారాల ప్రకారం.. గతంలో ఇటువంటి ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులైన బంగారం వైపు మళ్లారు. అప్పుడు బంగారం ధరలు 20శాతం నుంచి 50శాతం వరకు పెరిగాయి.

పెరుగుదలకు కారణాలు

బంగారం ధరల పెరుగుదల కేవలం జోస్యంపై మాత్రమే ఆధారపడలేదు. అంతర్జాతీయ నిపుణులు దీనికి అనేక వాస్తవ కారణాలను చెబుతున్నారు. వాణిజ్య యుద్ధాలు, ధరల పెరుగుదల, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా మారుతుందనే భయాలు పెట్టుబడిదారులను గోల్డ్ వైపు నెట్టేస్తున్నాయి. సుంకాలపై అనిశ్చితి, కరెన్సీల విలువ తగ్గడం వంటి అంశాలు విలువైన లోహానికి డిమాండ్‌ను పెంచుతున్నాయి.

రూ. 1.8 లక్షలకు బంగారం..

2026లో నిజంగా ఆర్థిక సంక్షోభం సంభవిస్తే.. అప్పుడు బంగారం ధరలు 25శాతం నుంచి 40శాతం వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం.. 2026 దీపావళి నాటికి మన దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,500 – 1,82,000 మధ్య చేరుకోవచ్చని అంచనా. ఇది కచ్చితంగా దేశంలో కొత్త రికార్డు అవుతుంది.

  ఏం చేయాలి..?

అనిశ్చిత సమయాల్లో మీ పెట్టుబడులను సురక్షితంగా ఉంచడానికి బంగారం ఒక మంచి మార్గం. బంగారం ధరలు ఇంతగా పెరిగితే పెళ్లిళ్లు, పండుగలు వంటి శుభకార్యాల సందర్భంగా కొనుగోలు చేసే వారిపై, అలాగే దీర్ఘకాలిక పొదుపు ప్రణాళికలపై ప్రభావం పడుతుంది. అయితే పెట్టుబడిదారులు కేవలం జోస్యాలపై ఆధారపడకుండా.. ప్రపంచ ఆర్థిక అంశాలు, ద్రవ్యోల్బణం లెక్కలు, దేశాల మధ్య ఉన్న పరిస్థితుల ఆధారంగానే తమ తుది నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉన్నప్పటికీ, సురక్షితమైన ఆస్తిగా బంగారం ఆకర్షణ ఏ మాత్రం తగ్గడం లేదు. 2026లో ఈ ఊహించిన ధరల పెరుగుదల నిజమవుతుందో లేదో చూడాలి..? కానీ సంక్షోభ సమయాల్లో పసిడికి ఉన్న విలువ మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..