Gold Price: భయపెడుతున్న బంగారం ధర.. త్వరలో 60 వేలు క్రాస్ చేసే ఛాన్స్..!
బంగారం ధర భయపెడుతోంది. అందనంత రేటులో అందనంత దూరంలో పసిడి పరుగులు పెడుతోంది. ఇప్పటికే రూ. 50వేల మార్క్ దాటిన గోల్డ్ రేట్.. రూ. లక్షకు రన్ రాజా రన్ అంటూ పరుగులు పెడుతోంది.
బంగారం ధర భయపెడుతోంది. అందనంత రేటులో అందనంత దూరంలో పసిడి పరుగులు పెడుతోంది. ఇప్పటికే రూ. 50వేల మార్క్ దాటిన గోల్డ్ రేట్.. రూ. లక్షకు రన్ రాజా రన్ అంటూ పరుగులు పెడుతోంది. కొద్ది రోజుల్లోనే 60వేల రూపాయలకు చేరొచ్చన్న అంచనాలు ఉన్నాయి. బంగారం ధర పరుగు చూస్తుంటే సామాన్యుడు కొనడం ఇక కలేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
బంగారం ధర భయపెడుతోంది. అందనంత రేటులో అందనంత దూరంలో పసిడి పరుగులు పెడుతోంది. ఉసేన్ బోల్ట్‌ను మించిన వేగంతో రన్ రాజా రన్ అంటోంది. ఆల్ టైమ్ హై రేట్లతో రికార్డులు బద్దలు కొట్టుకుంటూ పరిగెడుతోంది. 10 గ్రాముల బంగారం రేటు దాదాపు 53 వేల రూపాయలను టచ్ చేసింది. ఇక నెక్ట్స్ 60 వేలను కూడా తాకే అవకాశం ఉందంటున్నారు. బంగారం రేట్లు బ్రేకుల్లేని బుల్‌డోజర్‌లా పరిగెడుతుంటే సామాన్యుడు మాత్రం నలిగిపోతున్నాడు. ఈ రేట్లు చూసి విసిగి వేసారిపోతున్నాడు. గోల్డ్ రేట్లకు బ్రేకులు వేసే నాథుడే లేడా అని ప్రశ్నిస్తున్నాడు.
బంగారం.. ఇక నుంచి చూసి మురిసిపోవాల్సిందే..
ప్రస్తుతం 22 కేరట్ల బంగారం 10 గ్రాములు రూ. 52,670 అయ్యింది. ఇప్పుడు బంగారం రేటు పరిగెడుతోంది. బ్రేకుల్లేని రాకెట్‌లా దూసుకుపోతోంది. సామాన్యుడికి అందనంత ధరలో, అందుకోలేనంత దూరంలో పసిడి పరుగులు పెడుతోంది. బంగారం ధరలు మార్కెట్లో గత కొన్ని రోజులుగా చుక్కలు చూపిస్తున్నాయి. విపరీతంగా పెరిగిన ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చింది. కాస్త తగ్గుముఖం పడుతుందని భావించినప్పటికీ మళ్లీ బంగారం ధర పెరుగుతున్న తీరు బంగారం ప్రియులకు షాక్ ఇస్తోంది. తాజాగా గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగాయి.
ఒక్క రోజులో రూ. 100 పెరుగుదల..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు 53 వేల రూపాయలను టచ్ చేస్తోంది. ఒక్క రోజులో బంగారం ధర 100 రూపాయలు పెరిగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,110 రూపాయలు ఉంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో 350 రూపాయలు పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయలు పెరిగింది.
త్వరలో రూ. 60 వేలు దాటొచ్చు..
త్వరలో 10 గ్రాముల బంగారం రేటు 60 వేల రూపాయలను తాకొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముందుముందు 10 గ్రాముల పసిడి ధర లక్ష రూపాయలకు చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. బంగారం రేటు ఆల్ టైమ్ హైకి చేరుకోవడంతో పసిడి ప్రియులు షాక్‌కు గురవుతున్నారు. గోల్డ్ రేట్లు మరింతగా దూసుకుపోయే అవకాశం కనిపిస్తోంది తప్ప, తగ్గుతుందన్న భావన ఎవరిలోనూ వ్యక్తం కావడం లేదు. ఈ నెలలో ఇప్పటివరకు ఒకటి రెండు సందర్భాలు మినహాయించి బంగారం ధరలు తగ్గిన దాఖలాలు లేవు. ఒకవేళ ధర ఓ వంద రూపాయలు తగ్గితే, పెరిగినప్పుడు ఏకంగా 200, 300 రూపాయలవరకు పెరుగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో 1940 డాలర్లు..
ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఔన్స్ గోల్డ్ రేటు 1940 డాలర్లకు టచ్ అయింది. మన రూపాయి వీక్ కావడం, ఆర్థిక మాంద్యం అలుముకుంటుందనే భయాలు, పెట్టుబడులు గోల్డ్‌లోకి ప్రవహించడం…ఇవన్నీ కలిసి బంగారం రేటును ఒక్కసారిగా భగ్గుమనిపించాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అమెరికా ఫెడ్.. వడ్డీ రేట్లను అనుకున్నంతగా పెంచకపోవడం కూడా గోల్డ్ రేటు పెరగడానికి మరో కారణమంటున్నారు.
సామాన్యుడు బంగారం కొనేదెలా?
సామాన్యుడు బంగారం కొనేదెలా? ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్న ఇదే. కామన్‌మేన్‌కి అందనంత దూరంలోకి వెళ్లిపోయింది పసిడి రేటు. బంగారం రేటు చూసి మధ్య తరగతి మానవుడు.. బాబోయ్ అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బాల్ కేంద్రం కోర్టులో ఉంది. పరుగులు పెడుతున్న పసిడి రేటును తగ్గించడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోనుంది. బడ్జెట్ సాక్షిగా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆకాశంలో ఉన్న బంగారం రేటు నేలపైకి దిగి వస్తుంది.
భారీగా సుంకం..
దిగుమతి చేసుకున్న బంగారంపై 18.45 శాతం సుంకం విధిస్తున్నారు. బంగారం ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో గోల్డ్ రేట్లు తగ్గేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతోంది. దీంతో రాబోయే బడ్జెట్‌లో పసిడి మీద ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగారం ధర తగ్గాలంటే అదొక్కటే మార్గం కాబట్టి కేంద్రం ఆ చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.
నాడు రూ. 63 రూపాయలే..
1964లో 10 గ్రాముల బంగారం ధర 63.25 రూపాయలు ఉంటే దశాబ్దం తర్వాత రూ. 500-600 మధ్య గోల్డ్ రేటు ఊగిసలాడింది. ఇక 2017లో 10 గ్రాముల బంగారం రూ. 29,617 ఉంటే ఇప్పుడు రూ. 52,670కి చేరింది. దీనికి GST, తరుగు కలిపితే రూ. 60 వేలు అవుతుంది. అంటే అప్పుడు పదేళ్లలో దాదాపు 10 రెట్లు పెరిగిన గోల్డ్ రేటు….ఇప్పుడు ప్రతి ఐదేళ్లకు రెట్టింపవుతోంది.
అందని ద్రాక్షలా ఊరిస్తుంటే..
బంగారానికి సింగారానికి అవినాభావ సంబంధం ఉంది. మగువల మనసు దోచుకోవాలంటే గోల్డ్ బాట పట్టాల్సిందే అంటారు. ఇంట్లో శ్రీమతికి బహుమతి ఇవ్వాలన్నా, గాల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వాలన్నా ఠక్కున గుర్తొచ్చేది గోల్డ్. ఇక పెళ్లిళ్లకు, పేరంటాలకు, ఫంక్షన్లకు బంగారపు నగలు కొనుక్కోవడం లేదా కానుకలుగా ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. దీంతో ఇప్పుడు పెళ్లిళ్లు ఫంక్షన్లలో నగధగలు తగ్గిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ అందనంత దూరంలో, అందుకోలేనంత ధరలో అందని ద్రాక్షలా ఊరిస్తుంటే సామాన్యులు సతమతమైపోతున్నారు. గోల్డ్ కొనలేక, కొనకుండా ఉండలేక మల్లగుల్లాలు పడుతున్నారు. పసిడి రేట్లకు కేంద్రం కళ్లెం వేయకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవి మరింత పెరిగే అవకాశం ఉందని అనలిస్టులు చెబుతుండడం సామాన్యుడి గుండెల్లో గుబులు రేపుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..