Gold ETF: పసిడిపై బంగారం లాంటి రాబడి.. ఏడాదిలో ఎంతో మార్పు
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన గోల్డ్ ఈటీఫ్‌ల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్ పథకాల్లో సంవత్సరం క్రితం పెట్టుబడి పెట్టిన వారికి భారీగా రాబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గోల్డ్ ఈటీఎఫ్ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధరల్లో కనిపించిన పెరుగుదల గోల్డ్ ఈటీఎఫ్‌లలోనూ పెరిగింది. ఏడాదిలో క్రితం గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెడితే అత్యధికంగా 35 శాతం నుంచి 38 శాతం రాబడిని ఇచ్చాయి. దాదాపు 15 గోల్డ్ ఈటీఎఫ్‌లు ఇదే తరహా రాబడిని అందించాయి. గత నెలలో అంటే జనవరి 2025లో గోల్డ్ ఈటీఎఫ్‌లలో నికర పెట్టుబడులు రూ.3751.4 కోట్లకు పెరిగింది. పెట్టుబడిదారులు గరిష్ట రాబడిని గోల్డ్ ఈటీఎఫ్‌లు అందించడంతో ఆసక్తిగా పెట్టుబడికి ముందుకు వస్తున్నారు. గోల్డ్ ఇటిఎఫ్‌లు అంటే ఓపెన్-ఎండ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లు. ఇవి బంగారం, సంబంధిత సాధనాల్లో పెట్టుబడి పెడతాయి. భౌతిక బంగారం ధరలతో పాటు గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ల ధర పెరగడానికి లేదా తగ్గడానికి ఇదే కారణం. ఇతర ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల మాదిరిగానే గోల్డ్ ఈటీఎఫ్‌లు కూడా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేస్తారు. పెట్టుబడిదారులు తమ ట్రేడింగ్ ఖాతాల ద్వారా వాటిని కొనుగోలు చేసి విక్రయిస్తారు.
అత్యధిక రాబడినిచ్చిన ఈటీఎఫ్‌లు
- యూటీఐ గోల్డ్ ఈటీడీఎఫ్: 38.69%
- ఎల్ఐసీ ఎంఎఫ్ గోల్డ్ ఈటీఎఫ్: 38.12%
- హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీఎఫ్: 37.85%
- ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఈటీఎఫ్: 37.50%
- యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్: 37.39%
- ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్: 37.07%
- కోటక్ గోల్డ్ ఈటీఎఫ్: 36.98%
- ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్ : 36.96 %
- ఎస్‌బీఐ గోల్డ్ ఈటీఎఫ్: 36.92%
- మిరే అసెట్ గోల్డ్ ఈటీఎఫ్ : 36.89%
- నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీఈఎస్ : 36.84%
- డీఎస్‌సీ గోల్డ్ ఈటీఎఫ్: 36.73%
- ఎడెల్వీస్ గోల్డ్ ఈటీఎఫ్: 36.69%
- బరోడా బీఎన్‌పీ పారిబాస్ గోల్డ్ ఈటీఎఫ్: 36.57%
- టాటా గోల్డ్ ఈటీఎఫ్: 36.47%
గోల్డ్ ఈటీఎఫ్‌లపై రాబడి నేరుగా బంగారం ధరకు సంబంధించినదని నిపుణులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్లో బంగారం ధర గోల్డ్ ఈటీఎఫ్‌కు సంబంధించిన సురక్షితమైన పెట్టుబడి నేపథ్యంలో గోల్డ్ ఈటీఎఫ్‌లు ఈక్విటీ కంటే తక్కువ రిస్క్‌గా పరిగణిస్తారు. వారి రాబడి కూడా సాధారణంగా దీర్ఘకాలికంగా ఆకర్షణీయంగా ఉంటుంది. గత 25 సంవత్సరాల్లో బంగారం రాబడి పరంగా ఎస్ అండ్ పీ 500, నిఫ్టీ 50 వంటి ప్రధాన స్టాక్ మార్కెట్ సూచికలను అధిగమించింది. అయితే గోల్డ్ ఈటీఎఫ్ రాబడి భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని అనుకోలేమని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








