Gold Price: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందో తెలుసా?

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల ట్రెండ్ కొనసాగుతోంది. స్థానిక నగల వ్యాపారులు, రిటైలర్ల నుండి డిమాండ్ మందగించడంతో మంగళవారం బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. తులం బంగారంపై దాదాపు నిన్నటితో పోల్చుకుంటే రూ.250 వరకు తగ్గింది. ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం, స్థానిక నగల వ్యాపారులు, స్టాకిస్టుల నుంచి డిమాండ్ తగ్గడమే బంగారం ధర తగ్గడానికి కారణమని..

Gold Price: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందో తెలుసా?
Gold Price
Follow us
Subhash Goud

|

Updated on: Sep 03, 2024 | 6:42 AM

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల ట్రెండ్ కొనసాగుతోంది. స్థానిక నగల వ్యాపారులు, రిటైలర్ల నుండి డిమాండ్ మందగించడంతో మంగళవారం బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. తులం బంగారంపై దాదాపు నిన్నటితో పోల్చుకుంటే రూ.250 వరకు తగ్గింది. ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం, స్థానిక నగల వ్యాపారులు, స్టాకిస్టుల నుంచి డిమాండ్ తగ్గడమే బంగారం ధర తగ్గడానికి కారణమని వ్యాపారులు తెలిపారు.సెప్టెంబర్ నెల ప్రారంభమైపోయింది. 3న దేశంలోని బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గణేష్ చతుర్థికి ముందు బంగారం లేదా వెండిని కొనుగోలు చేయడానికి మార్కెట్‌కి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, ముందుగా తాజా ధరను తెలుసుకోండి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,760 ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

  1. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,760 ఉంది.
  2. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,760 ఉంది.
  3. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,910 ఉంది.
  4. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,760 ఉంది.
  5. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,760 వద్ద కొనసాగుతోంది.
  6. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,760 ఉంది.
  7. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,760 ఉంది.
  8. ఇక దేశంలో వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. కిలో వెండిపై ఏకంగా రూ.900 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. రూ.85,900 వద్ద కొనసాగుతోంది.

24 క్యారెట్ల బంగారం

24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. స్వచ్ఛమైన బంగారం లేదా 24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. అలాగే దానిలో ఏ ఇతర లోహాన్ని కలపరు. 24 క్యారెట్ల బంగారాన్ని బంగారు నాణేలు, కడ్డీల తయారీకి ఉపయోగిస్తారు. బంగారం కోసం ఇతర విభిన్న స్వచ్ఛతలు ఉన్నాయి. వీటిని 24 క్యారెట్‌లతో పోల్చి కొలుస్తారు.

22 క్యారెట్ల బంగారం

ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారం మంచిది. ఇది 22 భాగాలు బంగారం, రెండు భాగాలు వెండి, నికెల్ లేదా ఏదైనా ఇతర లోహం. ఇతర లోహాలను కలపడం ద్వారా బంగారం గట్టిపడుతుంది. అలాగే ఆభరణాలకు అనుకూలంగా ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం 91.67 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి