ఇప్పుడు ఈ బ్యాంక్ iPhone కొనుగోలుపై డిస్కౌంట్, ఈఎంఐ ఇవ్వదు.. ఎందుకో తెలుసా?

మీరు ఆపిల్‌ ఉత్పత్తులు లేదా iPhoneని కూడా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ వార్త తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఆపిల్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయడంపై ఈ బ్యాంక్ ఆఫర్‌లను పొందలేరు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐఫోన్ తయారీ దిగ్గజం ఆపిల్‌తో 5 సంవత్సరాల తర్వాత భాగస్వామ్యాన్ని ముగించింది. దీని కారణంగా, ఇప్పుడు ప్రజలు iPhone కాకుండా Apple ఉత్పత్తులపై ఈ బ్యాంక్ నుండి ఆఫర్‌లు..

ఇప్పుడు ఈ బ్యాంక్ iPhone కొనుగోలుపై డిస్కౌంట్, ఈఎంఐ ఇవ్వదు.. ఎందుకో తెలుసా?
Iphone
Follow us

|

Updated on: Sep 03, 2024 | 7:06 AM

మీరు ఆపిల్‌ ఉత్పత్తులు లేదా iPhoneని కూడా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ వార్త తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఆపిల్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయడంపై హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ ఆఫర్‌లను పొందలేరు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ ఐఫోన్ తయారీ దిగ్గజం ఆపిల్‌తో 5 సంవత్సరాల తర్వాత భాగస్వామ్యాన్ని ముగించింది. దీని కారణంగా, ఇప్పుడు ప్రజలు iPhone కాకుండా Apple ఉత్పత్తులపై ఈ బ్యాంక్ నుండి ఆఫర్‌లు లేదా ఎలాంటి తగ్గింపును పొందరు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్‌లు, పండుగ సీజన్‌లో సేల్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది షాక్. పండగ సీజన్‌లో ఆపిల్ ఉత్పత్తులపై బ్యాంకు నుంచి ఎలాంటి ప్రత్యేక డీల్‌ను పొందబోరని గుర్తించుకోండి.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికలో.. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గ్రూప్ హెడ్ పరాగ్ రావ్ ఈ భాగస్వామ్యం ఖర్చు, ఆదాయాన్ని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. తాము భాగస్వామ్యం నుండి తాత్కాలిక విరామం మాత్రమే తీసుకున్నాము. మేము 5 సంవత్సరాలు కలిసి పనిచేశాము. ఈ కంపెనీతో మాకు చాలా మంచి సంబంధం ఉంది. అయితే ఇప్పుడు దాన్ని సమీక్షించడం చాలా ముఖ్యమైనదిగా మారింది. ఆపిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మధ్య భాగస్వామ్యం కారణంగా క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కంపెనీ ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్, ఈఎంఐ సౌకర్యాలు అందేవి. ఇది ఇప్పుడు సాధ్యం కాదని అన్నారు.

ఆపిల్‌ వెబ్‌సైట్ ప్రకారం, వారు అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లపై క్యాష్‌బ్యాక్, ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తున్నారు. పలు బ్యాంకులతో ఆపిల్‌ఒప్పందాలు కుదుర్చుకుందని పరాగ్ రావ్ తెలిపారు. తాము గత 5 సంవత్సరాలుగా వారికి మాత్రమే ఈ సేవను అందిస్తున్నాము. అటువంటి పరిస్థితిలో భాగస్వామ్యం గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. పండుగల సీజన్‌కు బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. డిపాజిట్, క్రెడిట్ వృద్ధి వేగంగా ఉంటుందని విశ్వసిస్తున్నామని అన్నారు.

ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి