AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: వామ్మో.. తగ్గేదేలే అంటున్న బంగారం ధర.. ఇంకా ఎంత పెరగనుంది?

Gold Price: ముఖ్యంగా ఇరాన్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి తర్వాత మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ మార్కెట్లలో చాలా అనిశ్చితి నెలకొంది. అటువంటి సమయాల్లో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి ఎంపికల వైపు మొగ్గు చూపుతారు. బంగారాన్ని ఎల్లప్పుడూ సురక్షితమైన..

Gold Price: వామ్మో.. తగ్గేదేలే అంటున్న బంగారం ధర.. ఇంకా ఎంత పెరగనుంది?
Subhash Goud
|

Updated on: Jun 14, 2025 | 11:55 AM

Share

ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య బంగారం ధరలు పెరిగాయి. గత మూడు నాలుగు రోజులుగా ఎగబాకుతున్నాయి బంగారం ధరలు. శనివారం ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. జూన్‌ 13న ఉన్న ధరలతో పోలిస్తే జూన్‌ 14న ఉదయం6 గంటల సమయానికి దాదాపు తులం బంగారంపై ఏకంగా 2 వేల రూపాయలకునే పెరిగింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడి తర్వాత పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య దేశ రాజధానిలో బంగారం రూ. 2,200 పెరిగి రికార్డు స్థాయిలో 10 గ్రాములకు రూ. 1,01,680కి చేరుకుంది. 10 గ్రాములకు రూ. లక్ష దాటిన తర్వాత ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, రాబోయే 12 నెలల్లో బంగారం 1.25 లక్షలకు పెరుగుతుందా లేదా అంతకంటే ఎక్కువ ఉంటుందా? 12 నెలల్లో బంగారం ధర ఎంత ఉంటుందో బులియన్‌ మార్కెట్‌ నిపుణుల ద్వారా తెలుసుకుందాం?

ఇది కూడా చదవండి:IRCTC ఖాతాకు ఆధార్‌ను ఎలా లింక్ చేయాలో తెలుసా? వెరీ సింపుల్‌.. లేకుంటే తత్కాల్ బుకింగ్ చేయలేరు!

దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు చారిత్రాత్మక రికార్డును సృష్టించాయి. మొదటిసారిగా బంగారం 10 గ్రాములకు రూ. 1,00,000 స్థాయిని దాటింది. ఇది ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన, అతిపెద్ద పెరుగుదలగా పరిగణిస్తున్నారు నిపుణులు. ఈ పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక సూచికలు ముఖ్యమైన పాత్ర పోషించాయి.

ఇవి కూడా చదవండి

బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?

ముఖ్యంగా ఇరాన్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి తర్వాత మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ మార్కెట్లలో చాలా అనిశ్చితి నెలకొంది. అటువంటి సమయాల్లో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి ఎంపికల వైపు మొగ్గు చూపుతారు. బంగారాన్ని ఎల్లప్పుడూ సురక్షితమైన స్వర్గధామంగా పరిగణిస్తారు. దీని కారణంగా బంగారం డిమాండ్‌లో అకస్మాత్తుగా పెరుగుదల కనిపించింది. ఇది ధరల పెరుగుదలకు దారితీసింది.

ఇది కూడా చదవండి: Snake Plants: ఈ 5 మొక్కలు మీ ఇంట్లో ఉంటే పాములు దరిదాపుల్లోకి రావు!

దీనితో పాటు అమెరికాలో విడుదలైన తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు ఊహించిన దానికంటే తక్కువగా ఉన్నాయి. దీని వలన ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. వడ్డీ రేట్లలో కోత డాలర్‌ను బలహీనపరుస్తుంది. బంగారాన్ని బలపరుస్తుంది. ఎందుకంటే వడ్డీ లేని ఆస్తులలో పెట్టుబడి పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: AC Cooling Tips: మీ కారు ఏసీ కూలింగ్‌ తగ్గుతోందా? ఈ పొరపాట్లు కావచ్చు.. ఇలా చేయండి

12 నెలల్లో ధర ఎంత అవుతుంది?

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరపై భారీ అంచనాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) అంచనా ప్రకారం రాబోయే 12 నెలల్లో బంగారం ధర ఔన్సుకు $4,000 వరకు పెరగవచ్చు. అదే సమయంలో గోల్డ్‌మన్ సాచ్స్ కూడా సెంట్రల్ బ్యాంకుల దూకుడు కొనుగోళ్ల కారణంగా 2025 చివరి నాటికి బంగారం $3,700, 2026 మధ్య నాటికి ట్రాయ్ ఔన్సుకు $4,000 స్థాయికి చేరుకోవచ్చని తన అంచనాను పునరుద్ఘాటించింది. అయితే ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం ఉన్నప్పటికీ చమురు సరఫరాలో పెద్దగా అంతరాయం కలిగే అవకాశం లేదని గోల్డ్‌మన్ సాచ్స్ కూడా అంటున్నారు. అయినప్పటికీ, భౌగోళిక రాజకీయ నష్టాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంగా సమీప భవిష్యత్తులో బంగారం ధరలు ఎక్కువగానే ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: Indian Railways: మీరు రైలు లేదా కోచ్‌ను బుక్‌ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి