IRCTC ఖాతాకు ఆధార్‌ను ఎలా లింక్ చేయాలో తెలుసా? వెరీ సింపుల్.. లేకుంటే తత్కాల్ బుకింగ్ చేయలేరు!
IRCTC: జూలై 1, 2025 నుండి తత్కాల్ టిక్కెట్లను ఆధార్ ధృవీకరించబడిన ఖాతాల నుండి మాత్రమే బుక్ చేసుకోవచ్చు. జూలై 15 నుండి బుకింగ్ సమయంలో OTP ఆధారిత వ్యవస్థ అమలు చేస్తారు. మీ ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు..

మీరు IRCTC నుండి రైలు టిక్కెట్లు బుక్ చేసుకుంటే ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది. తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో రైల్వేలు పెద్ద మార్పులు చేశాయి. రైల్వే ప్రతినిధి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పుడు IRCTC ఖాతాను ఆధార్‌తో అనుసంధానించి ధృవీకరించిన ప్రయాణికులు మాత్రమే తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
జూలై 1, 2025 నుండి తత్కాల్ టిక్కెట్లను ఆధార్ ధృవీకరించబడిన ఖాతాల నుండి మాత్రమే బుక్ చేసుకోవచ్చు. జూలై 15 నుండి బుకింగ్ సమయంలో OTP ఆధారిత వ్యవస్థ అమలు చేస్తారు. మీ ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని సిస్టమ్‌లోకి నమోదు చేసినప్పుడు మాత్రమే టికెట్ బుక్ ఉత్పత్తి అవుతుంది. టికెట్ కౌంటర్లలో కూడా ఇదే OTP ధృవీకరణ వ్యవస్థ అమలు చేయనున్నారు. కౌంటర్ నుండి టికెట్ కొనుగోలు చేసేటప్పుడు ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు OTP అందుతుంది.
ఇది కూడా చదవండి: AC Cooling Tips: మీ కారు ఏసీ కూలింగ్ తగ్గుతోందా? ఈ పొరపాట్లు కావచ్చు.. ఇలా చేయండి
IRCTC ఖాతాను ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి?
మీ ఆధార్ నంబర్‌ను మీ IRCTC ఖాతాకు ఎలా లింక్ చేయాలో దశలవారీగా తెలుసుకుందాం.
☛ ముందుగా IRCTC వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వండి. మీ ప్రొఫైల్ లేదా ఖాతా విభాగంలో “మై అకౌంట్” ఆప్షన్‌ను ఎంచుకోండి.
☛ మై అకౌంట్‌లోకి వెళ్లి “లింక్ యువర్ ఆధార్” లేదా “ఆథంటికేట్ యూజర్” ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీరు ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడి, పేరు (ఆధార్ లో ఉన్నట్లు) నమోదు చేయవలసిన చోట కొత్త పేజీ తెరుచుకుంటుంది.
☛ నిబంధనలు, షరతులను అంగీకరిస్తూ బాక్స్‌ను టిక్ చేసి “Send OTP” పై క్లిక్ చేయండి. మీ ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని నమోదు చేసి “Verify OTP” పై క్లిక్ చేయండి. OTP ధృవీకరణ తర్వాత మీ ఆధార్ మీ IRCTC ఖాతాకు లింక్ అవుతుంది.
☛ తత్కాల్ టికెట్ బుకింగ్ మరొక నియమం మార్చింది. AC క్లాస్ బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైతే, ఏ ఏజెంట్ కూడా మొదటి 30 నిమిషాలు (అంటే 10:00 నుండి 10:30 వరకు) టిక్కెట్లు బుక్ చేసుకోలేరు. ఈ సమయం సాధారణ ప్రయాణికులకు మాత్రమే.
☛ గతంలో ఈ సమయం 10 నిమిషాలు మాత్రమే ఉండేది. అదేవిధంగా ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే నాన్-ఏసీ క్లాస్ బుకింగ్‌లో 11:00 నుండి 11:30 వరకు సమయం వ్యక్తిగత ప్రయాణికులకు మాత్రమే కేటాయిస్తారు. ఈ సమయంలో ఏజెంట్లు టిక్కెట్లు బుక్ చేసుకోలేరు.
ఇది కూడా చదవండి: Gold Price Today: రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు..
ఇది కూడా చదవండి: Indian Railways: మీరు రైలు లేదా కోచ్‌ను బుక్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




