Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: మీరు రైలు లేదా కోచ్‌ను బుక్‌ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి

Indian Railways: రైలు బోగిని ఎప్పుడు పడితే అప్పుడు బుక్‌ చేసుకోవడానికి కుదరదు. మీ ప్రయాణ తేదీకి 6 నెలలు ముందే FTR రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు నెలరోజుల ముందు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే రైలు బోగి బుక్‌ చేసుకునే సమయంలో..

Indian Railways: మీరు రైలు లేదా కోచ్‌ను బుక్‌ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి
Subhash Goud
|

Updated on: Jun 14, 2025 | 7:24 AM

Share

చాలా మంది వివాహాలు, ఇతర టూర్లకు వెళ్లే ముందు అందరికి కలిసి ఒకే వాహనం మాట్లాడుకుని వెళ్తారు. అందరు ఒకే గ్రూపుగా ప్రయాణం చేయడం వల్ల ఒకే వాహనం అద్దెకు తీసుకుని వెళ్తుంటారు. ఇక రైలు ప్రయాణం విషయానికొస్తే కొందరు గ్రూప్‌గా వెళ్లినా విడివిడిగా రైలు టికెట్‌ బుకింగ్‌ చేసుకుని వెళ్తారు. ఇలా విడివిడిగా టికెట్స్‌ బుకింగ్‌ చేసుకోవడం వల్ల అందరికి ఒకే బోగిలో సీటు వచ్చే అవకాశం ఉండదు. ఒక్కోచోట సీటు రిజర్వ్‌ అవుతాయి. కానీ గ్రూప్‌గా కలిసి టికెట్లు బుక్‌ చేసుకుని అందరికి ఒకే బోగిలో సీటు దొరిగే అవకాశాలు ఉంటాయి. లేదా రైలు బోగిని మొత్తం బుక్‌ చేసుకుంటే మరి మంచిది. మరి చాలా మంది ఉంటే ఒకేసారి బోగిని బుక్‌ చేసుకోవడం తెలియకపోవచ్చు. గ్రూప్ టికెట్ బుకింగ్ ఎలా బుక్ చేసుకోవాలో, దాని నియమ నిబంధనలు ఏంటో తెలుసుకుందాం..

గ్రూప్ టికెట్ బుకింగ్ ఇలా?

  • ముందుగా మీరు IRCT వెబ్ సైట్‌కి వెళ్లాలి. అక్కడ మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్‌తో లాగిన్‌ కావాల్సి ఉంటుంది.
  • అందులో మీరు మొత్తం రైలును బుక్ చేసుకోవాలనుకుంటున్నారో లేదా కోచ్ ను బుక్ చేసుకోవాలనుకుంటున్నారో అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.
  • అక్కడ మీ అవసరాన్ని బట్టి ఎంచుకోండి. అలాగే ప్రయాణ తేదీ? ఏ స్టేషన్‌లో ఎక్కాలని అనుకుంటున్నారు? ఏ స్టేషన్‌లో దిగాలనుకుంటున్నారో ఆప్షన్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • అలాగే ప్రయాణికుల సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుంది.
  • ఏసీ కోచ్ కావాలా నాన్ ఏసీ కోచ్ కావాలో కూడా ఎంపిక చేసుకోవాలి.
  • తర్వాత రిఫరెన్స్ నెంబర్ కనిపిస్తుంది. దాని సాయంతో ఆరు రోజుల్లోపు రిజిస్ట్రేషన్ మొత్తాన్ని చెల్లించాలి.
  • చెల్లింపు పూర్తయ్యాక మీ బుకింగ్ నిర్ధారిస్తూ ఒక ఎఫ్‌టిఆర్ నెంబర్ వస్తుంది. అప్పుడు మీ బుకింగ్‌ కన్ఫర్మ్‌ అయినట్లు మెసేజ్‌ వస్తుంది.

ఎంత చెల్లించాలి?

ఏడు రోజుల టూర్ కోసం మీరు ఒక కోచ్‌ను బుక్‌ చేసుకుంటే రిజిస్ట్రేషన్‌కు 50,000 ఖర్చు పెట్టాలి. అలాగే 18 కోచులు ఉన్న మొత్తం రైలునో బుకింగ్ బుక్ చేసుకోవాలంటే వారం రోజులకు దాదాపు రూ.9 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రైలు కోచ్‌లు 18కి మించి ఉంటే ఒక్కొక్క కోచ్ కు 50 వేల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 18 కంటే తక్కువ కోచ్ లు ఉన్న రైలు బోగిని ఎంచుకుంటే కూడా దానికి రూ.9 లక్షల వరకు కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రూప్ టికెట్ బుకింగ్‌లో భాగంగా 50 నుండి 100 మంది వరకే IRCTC అనుమతి ఇస్తుంది. దీనికి తగిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని గుర్తించుకోండి.

అయితే ఇంకో విషయం ఏంటంటే రైలు బోగిని ఎప్పుడు పడితే అప్పుడు బుక్‌ చేసుకోవడానికి కుదరదు. మీ ప్రయాణ తేదీకి 6 నెలలు ముందే FTR రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు నెలరోజుల ముందు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే రైలు బోగి బుక్‌ చేసుకునే సమయంలో ఛార్జీలు కూడా మారవచ్చని గమనించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి