Gold & Silver Price: స్థిరంగా బంగారం ధరలు… వెండి రేట్లు అలా.. హైదరాబాద్లో ధరలు ఇలా..
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో పసిడి కొనాలనుకునేవారు
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో పసిడి కొనాలనుకునేవారు కాస్త వెనకడుగు వేయాల్సి వచ్చింది. కానీ ఈరోజు ఉదయం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్కెట్లో పసిడి ధరలలో ఎలాంటి మార్పు లేదు.. ఈరోజు మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,070 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేట్..రూ.47,070 కు చేరింది. దీంతో బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు.. అలాగే.. దేశంలోని ప్రధాన నగర మార్కెట్లలో ఈరోజు (అక్టోబర్ 18న) బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
హైదరాబాద్ ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,180 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,200కు చేరింది. అలాగే… ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 46,330 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,540కు చేరింది. అలాగే..దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,070 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,070కు చేరింది. ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్లో పసిడి ధర రూ.44,630 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 48,690కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో ఈరోజు ఉదయం బంగారం ధరలు.. 0 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,180 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,200కు చేరింది. బంగారం పై ప్రభావం చూపే అంశాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అంతర్జాతీయ పసిడి ధరలలో మార్పులు, వాణిజ్య యుద్దాలు.. జువెలరీ మార్కెట్ వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి..
ఇక బంగారం బాటలోనే వెండి కూడా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం వెండి ధరలలో ఎలాంటి మార్పులు లేదు. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 636కు చేరింది. అలాగే కిలో వెండి ధర రూ. 63,000లకు చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలలో ఎలాంటి మార్పులు జరగలేదు.
హైదరాబాద్ లో కేజీ సిల్వర్ రూ. 67,400 ఢిల్లీలో కేజీ సిల్వర్ రూ. 63,600 ముంబైలో కేజీ సిల్వర్ రూ. 63,600 ఇక చెన్నైలో కేజీ సిల్వర్ రూ. 67,400 అలాగే విజయవాడ, విశాఖపట్నంలో కేజీ సిల్వర్ రూ. 67,400
Anasuya Photos: ఆకట్టుకుంటున్న ‘అనసూయ’ అందాలు.. ఎట్రాక్ట్ చేస్తున్న న్యూ ఫొటోస్..