Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Go Air: గో ఎయిర్ బంపర్ ఆఫర్.. వ్యాక్సిన్ వేసుకున్నవారికి 20 శాతం డిస్కౌంట్..

విమానం ప్రయాణం చేయాలనుకునేవారికి గో ఎయిర్‌ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పూర్తిగా వ్యాక్సినేషన్ చేసుకున్నవారికి 20 శాతం రాయితీ ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది...

Go Air: గో ఎయిర్ బంపర్ ఆఫర్.. వ్యాక్సిన్ వేసుకున్నవారికి 20 శాతం డిస్కౌంట్..
Go Air
Srinivas Chekkilla
|

Updated on: Dec 21, 2021 | 9:38 PM

Share

విమానం ప్రయాణం చేయాలనుకునేవారికి గో ఎయిర్‌ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పూర్తిగా వ్యాక్సినేషన్ చేసుకున్నవారికి 20 శాతం రాయితీ ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. గోఎయిర్ దేశీయ విమానాల్లో ప్రయాణించే వారు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపడం వల్ల ఈ రాయితీని పొందవచ్చు. ఈ ఆఫర్ భారతదేశంలో ఉన్న ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుందని ఆ సంస్థ తెలిపింది. డొమెస్టిక్ ఫ్లైట్ టిక్కెట్ల బుకింగ్ సమయంలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించాలని సూచించింది.

గో ఫస్ట్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో మాత్రమే ఆఫర్ చెల్లుబాటు అవుతుందని కంపెనీ తెలిపింది. బుకింగ్ తేదీ నుంచి 15 రోజుల వరకు ప్రయాణ తేదీలకు డబుల్-వ్యాక్సినేషన్ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది. ప్రయాణికులు సెర్చ్ పేజీలోని ప్రోమో కోడ్ విభాగంలో GOVACCI ప్రోమో కోడ్‌ను నమోదు చేయాలని సూచించింది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 నమోదయింది. మహారాష్ట్ర, ఢిల్లీలో 54 కేసుల చొప్పున నమోదయ్యాయి. యూఎస్‌లో గత వారం కొత్త కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌లలో దాదాపు 73 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులున్నాయి. ప్రస్తుతం యూఎస్‌లో ఇది అత్యంత సాధారణమైన కరోనా వైరస్ వేరియంట్‌గా మారింది.

Read Also.. Disney+Hotstar Rs.49 paln : డిస్నీ+ హాట్‌స్టార్‌ కేవలం రూ.49 కే.. ఎవరికంటే..