Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ముందు ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి, లేదంటే భారీ నష్టం తప్పదు..!

Electric Scooter: వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో.. ప్రజలంతా ప్రత్యామ్నాయ

Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ముందు ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి, లేదంటే భారీ నష్టం తప్పదు..!
Electric Scooty
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 21, 2021 | 12:15 PM

Electric Scooter: వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో.. ప్రజలంతా ప్రత్యామ్నాయ వాహనాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి లేకపోవడంతో దానికి సంబంధించిన వివరాలు ఎవరికీ పెద్దగా తెలియదు. వాటిపై పరిజ్ఞానం కూడా అంతంత మాత్రమే. అందుకే.. ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్స్, కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు.. ఇతర వ్యక్తుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటుంటారు. లేదంటే ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసి వివరాలు తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌కి సంబంధించి ఇవాళ మనం కొన్ని కీలక వివరాలు తెలుసుకుందాం. ఎవరైనా, ఏదైనా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే ముందు 5 విషయాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే నష్టపోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. మరి ఆ ఐదు కీలక అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మన అవసరాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.. ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటే మీకు అది ఎంత అవసరమో ఆలోచించుకోవాలి. అవసరానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. ఒకేవేళ మీరు ఇంటి నుంచి ఆఫీస్‌కు ప్రయాణం కోసం ఆ స్కూటర్‌ను కోనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. దూరాన్ని బేరీజు వేసుకోవాలి. మధ్యలో ఛార్జ్ స్టేషన్స్ ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే.. ఒకే ఛార్జ్‌లో ఇంటి నుంచి ఆఫీస్‌కు వచ్చేంత దూరం ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఒకే ఛార్జ్‌లో ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్లి రావొచ్చు అనుకుంటే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయొచ్చు. లేదంటే.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఛార్జ్ చేయడం ఇబ్బందిగా మారుతుంది.

డ్రైవింగ్ రేంజ్.. ఏదైనా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసే ముందు, దాని డ్రైవింగ్ రేంజ్ అర్థం చేసుకోవాలి. అంటే ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్‌తో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదు అనేది తెలుసుకోవాలి. కంపెనీ క్లెయిమ్‌తో, డ్రైవింగ్ టెస్ట్ సమయంలో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ పరిధిని కూడా తనిఖీ చేయవచ్చు.

బ్యాటరీ కెపాసిటీ.. బైక్‌లో మళ్లీ మళ్లీ పెట్రోల్‌ నింపాల్సిన అవసరం లేకుండా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని చూసుకుంటాం. అదేవిధంగా, ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బ్యాటరీ కెపాసిటీ కీలకం. అందువల్ల, ఈ-స్కూటర్‌ను కొనుగోలు చేసే ముందు దాని బ్యాటరీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తీసుకోండి. బ్యాటరీ ఎన్ని వాటేజ్‌లో ఉంది, బ్యాటరీ వాటర్‌ప్రూఫ్‌గా ఉందా లేదా, షాక్‌ప్రూఫ్‌గా ఉందా లేదా, రీప్లేస్‌మెంట్ కోసం షరతులు ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

సర్వీసింగ్ నిబంధనలను తప్పక పరిశీలించాలి.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసే ముందు.. దాని సర్వీసింగ్ వివరాలను కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం మార్కెట్‌లో కొత్త టెక్నాలజీతో వస్తోంది. ప్రస్తుతం ఉన్న మెకానిక్‌లు ఎలక్ట్రిక్‌ బైక్స్‌ సర్వీసింగ్ చేయలేరు. కేవలం కంపెనీ మెకానిక్‌లు మాత్రమే దీనిని సర్వీస్ చేయగలరు. అలాగే ఏదైనా రిపేర్ వస్తే.. దానికి సంబంధించిన పరికరాలు కూడా మార్కెట్‌లో అందుబాటులో లేవు.

ధరలను కంపేర్ చేయండి.. ప్రస్తుతం, మార్కెట్‌లో అనేక కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 40 వేల నుండి 1.50 లక్షల రూపాయల రేంజ్‌లో ఉన్నాయి. ధరలను బట్టి ఫీచర్లు, మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ బేరీజు వేసుకుని ఎలక్ట్రికల్ బైక్‌ని కొనుగోలు చేసుకోవాలి.

Also read:

Chanakya Niti: జీవితంలో విజయం సాధించాలంటే.. యవ్వనంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి..

Health Tips: ఖాళీ కడుపుతో వీటిని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.. ఏం తినాలో ఇక్కడ తెలుసుకోండి..

Stretch Marks: స్ట్రెచ్ మార్క్స్ ఇబ్బంది పెడుతున్నాయా? ఈ 5 సహజ మార్గాలతో ఉపశమనం పొందండి..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?