AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart: ఆర్డర్‌ చేసిన రోజే డెలివరీ.. ఫ్లిప్‌కార్ట్‌ సరికొత్త ప్రయత్నం..

అయితే కంపెనీ మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సరికొత్త ప్రయత్నానికి తెర తీసింది. వస్తువులను బుక్‌ చేసిన రోజే డెలివరీ చేసేందుకు ఫ్లిప్‌ కార్ట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 20 నగరాల్లో...

Flipkart: ఆర్డర్‌ చేసిన రోజే డెలివరీ.. ఫ్లిప్‌కార్ట్‌ సరికొత్త ప్రయత్నం..
Flipkart
Narender Vaitla
|

Updated on: Feb 01, 2024 | 5:56 PM

Share

ఈ-కామర్స్‌ రంగం రోజురోజుకీ విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌కు క్రేజ్‌ పెరుగుతోంది. అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసే రోజులు వచ్చేశాయ్‌. చివరికి పాల ప్యాకెట్లు కూడా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ పెట్టే రోజులు వచ్చేశాయ్‌. గ్రాసరీ ఐటెమ్స్‌ను నిమిషాల వ్యవధిలోనే అందిస్తున్నాయి. ఇక అమెజాన్‌ ప్రైమ్‌ లాంటి సేవలను ఎలాంటి వస్తువులనైనా ఒక రోజులో అందిస్తున్నాయి.

అయితే కంపెనీ మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సరికొత్త ప్రయత్నానికి తెర తీసింది. వస్తువులను బుక్‌ చేసిన రోజే డెలివరీ చేసేందుకు ఫ్లిప్‌ కార్ట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 20 నగరాల్లో తొలుత ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడతో పాటు అహ్మదాబాద్‌, బెంగళూరు, భువనేశ్వర్‌, కోయంబత్తూరు, చెన్నై, దిల్లీ, గువాహటి, ఇందౌర్‌, జైపుర్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, లుథియానా, ముంబయి, నాగ్‌పూర్‌, పుణె, పట్నా, రాయ్‌పుర్‌, సిలిగురి నగరాల్లో తొలుత ఈ సేవలను ప్రారంభించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. కాలక్రమేణ ఈ సేవలను దేశమంతా విస్తరించేందుకు ఫ్లిప్‌కార్ట్ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయన్న దానిపై ఇంకా ఎలాంటి తేదీ ప్రకటించలేదు.

ఇదిలా ఉంటే మొబైల్స్, బుక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ వంటి వస్తువులను బుక్‌ చేసిన రోజే కస్టమర్లకు అందించాలని ఫ్లిప్‌కార్ట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అదే రోజు డెలివరీ పొందాలంటే కస్టమర్లు మధ్యాహ్నం ఒంటి గంటలోపే వస్తువులను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఆ రోజు అర్థరాత్రి 12 గంటలలోపు వస్తువులు డెలివరీ చేస్తారు. ఒకవేళ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బుక్ చేసినట్లయితే మరుసటి రోజు డెలివరీ అవుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా