AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharmendra Pradhan: జై అనుసంధాన్.. వికసిత్ భారత్ వైపు ముందడుగు.. బడ్జెట్‌పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

2024-25 మధ్యంతర బడ్జెట్‌పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఈ బడ్జెట్ 'వికసిత్ భారత్' వైపు ఒక ముందడుగు అంటూ పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో అతిపెద్ద ప్రకటన 'జై అనుసంధన్' పథకం. నేటి బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కార్పస్ ఫండ్‌గా ప్రకటించారు. ఏ ప్రైవేట్ సంస్థ అయినా రుణాన్ని ఎంచుకుంటే వారికి 50 ఏళ్లపాటు వడ్డీ లేని రుణం లభిస్తుంది.

Dharmendra Pradhan: జై అనుసంధాన్.. వికసిత్ భారత్ వైపు ముందడుగు.. బడ్జెట్‌పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..
Dharmendra Pradhan
Shaik Madar Saheb
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 01, 2024 | 6:21 PM

Share

నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌‌ (2024-25 మధ్యంతర బడ్జెట్‌) ను ప్రవేశపెట్టింది. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వచ్చే ఐదేళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం కాబోతుందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయని తెలిపారు. డెమొక్రసీ, డెమొగ్రఫీ, డైవర్సిటీకి దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే సత్తా ఉందన్నారామె. లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయన్నారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అనేక సంస్కరణలు ఫలితాలిస్తున్నాయని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. భారత ఆర్థిక వ్యవస్థను సంఘటితపర్చడానికి డిజిటల్‌ ఇండియా చాలా కీలకమన్నారు నిర్మలా సీతారామన్‌. పన్ను వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ట్యాక్స్‌ చెల్లింపుదారుల సంఖ్య పెరిగిందన్నారు.

2024-25 మధ్యంతర బడ్జెట్‌పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఈ బడ్జెట్ ‘వికసిత్ భారత్’ వైపు ఒక ముందడుగు అంటూ పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో అతిపెద్ద ప్రకటన ‘జై అనుసంధన్’ పథకం. నేటి బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కార్పస్ ఫండ్‌గా ప్రకటించారు. ఏ ప్రైవేట్ సంస్థ అయినా రుణాన్ని ఎంచుకుంటే వారికి 50 ఏళ్లపాటు వడ్డీ లేని రుణం లభిస్తుంది. దీని వల్ల భారతదేశంలోని కొత్త తరానికి నేరుగా ప్రయోజనం లభిస్తుంది. జాతీయ విద్యా విధానం అమలులోకి వచ్చింది.. ఇన్నోవేషన్ విప్లవ రూపం దాల్చింది. పీఎం శ్రీపై చర్చ జరిగింది. కొత్త ఐఐటీలు, ఐఐఎంలపై చర్చ జరిగింది. స్కిల్ ఇండియాలో భాగంగా దేశంలోని 1.4 కోట్ల మంది యువతకు నైపుణ్యం, నైపుణ్యాలు పెంచడం కోసం శిక్షణ.. ఇవ్వనున్నట్లు తెలిపారు.

ధర్మేంద్ర ప్రధాన్ వీడియో..

మూడు కొత్త రైల్వే కారిడార్‌ల గురించి కూడా ఈ బడ్జెట్ లో చెప్పడం జరిగిందన్నారు. దీని అర్థం నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి కల్పించడం, ప్రజల జీవనశైలి మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మొత్తానికి, ఈ బడ్జెట్ సంక్షేమం, సంపద సృష్టి మధ్య సమతుల్యతను కలిగి ఉందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

ఈ బడ్జెట్‌లో ప్రకటించిన ‘వికసిత్ భారత్’ కింద 50 సంవత్సరాల వడ్డీ రహిత రుణంతో లక్ష కోట్ల కార్పస్ ఏర్పాటు చేయడం వల్ల.. రాబోయే సంవత్సరాల్లో పరిశోధన, ఆవిష్కరణ, వ్యవస్థాపకత రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయవచ్చునని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ‘జై అనుసంధన్’ పథకానికి సంబంధించిన విషయాలను తెలియజేసినందుకు గానూ ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తీర్చేదిద్దే దిశగా ప్రధాని మోదీ ఆలోచనల నుంచి.. అమలులోకి రాబోతున్న ‘జై అనుసంధన్’ పథకం యువతలోని ఆత్మస్థైర్యాన్ని వెలికితీయడంలో, భారతదేశాన్ని పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్ట్-అప్‌ల ప్రపంచ కేంద్రంగా స్థాపించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..