బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగంగా అభివర్ణించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందన్నారు. ఈ 10 ఏళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి లభించిందని తెలిపారు. మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యమని ఇస్తామని, వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్లనిర్మాణం లక్ష్యమని తెలిపారు.