Today Gold Rates (16-02-21): పసిడి ప్రియులకు శుభవార్త.. దిగివస్తున్న బంగారం ధరలు.. తాజాగా ఎంత తగ్గిందంటే…
Today Gold Rates (16-02-21): గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధరల ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరిలో ఎక్కువగా తగ్గుతూ వస్తోంది బంగారం ...
Today Gold Rates (16-02-21): గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధరల ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరిలో ఎక్కువగా తగ్గుతూ వస్తోంది బంగారం ధర. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ దేశీయంగా పసిడి ధరలు పతనం అవుతున్నాయి. ఇక దేశీయంగా బంగారం ధరలను పరిశీలిస్తే మంగళవారం పది గ్రాముల బంగారం ధరపై రూ.340 తగ్గింది. ప్రస్తుతం దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 47000 ఉంది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,290 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రామలు ధర రూ.44,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,290 ఉంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,570 ఉండగా, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.48,630 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.47,000 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,720 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రూ.49,420, బెంగళూరు రూ.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,290.
కాగా, దేశంలోని బంగారం ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Also Read: LIC: అదిరిపోయే ఎల్‌ఐసీ పాలసీ.. రూ. 55 కడితే.. రూ. 13 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవే.!